Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోతులూరి బ్రహ్మంగారు చెప్పినవి జరిగినవి...

Advertiesment
potuluri veera brahmam gari kalagnanam
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళ పత్ర గ్రంధాలలో రచించి భద్రపరచారు. వీటినే కాలజ్ఞాన తత్వాలు అంటారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన ముందే చెప్పారు..
ఇప్పటి వరకు జరిగినవిగా భావిస్తున్నవి:
* నీళ్ళతో దీపాలు వెలిగిస్తారు (విద్యుత్ శక్తి) (నీటితో జనరేటరు)
* ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి. (యంత్ర వాహనాలు)
* కాశీ పట్నం 40 రోజుల పాటు పాడుబడుతుంది.
* ఒక అంబ (వితంతువు) 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది. (ఇందిరా గాంధీ)
* తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. (ఎన్.టి.ఆర్, జయలలిత, ఎంజిఆర్ తదితరులు. చలన చిత్రాలు)
* రాచరికాలు,రాజుల పాలనా నశిస్తాయి. (ప్రజా ప్రభుత్వాలు)
* ఆకాశాన పక్షివాహనాలు కూలి అనేకమంది మరణిస్తారు. (విమాన ప్రమాదాలు)
* జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది.
* బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి.
* దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమౌతాయి. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి.
* చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి. కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు.
* రావణ కాష్టాన కల్లోలములు రేగి దేశాన్ని అల్లకల్లోల పరుస్తాయి.(శ్రీలంకలోని తీవ్రవాద పణామాలు)
* గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు.(లాల్ బహుద్దూర్ శాస్త్రి)
* కపట యోగులు విపరీతంగా పెరిగి పోతారు. వీరివలన ప్రజలంతా మోసపోతారు.
* అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి.

Share this Story:

Follow Webdunia telugu