Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పారిజాత వృక్షంపై వైరల్ అవుతున్న సమాచారం.. ఏంటది?

శ్రీకృష్ణుడు సత్యభామ కోసం పారిజాత పుష్పాన్ని దేవలోకం నుంచి తీసుకొచ్చిన కథ తెలిసిందే. ఈ పారిజాత వృక్షం యూపీలోని బారబంకి జిల్లాలోని కింటూరు గ్రామం వద్ద వుంది. ఈ పారిజాత వృక్షానికి సంబంధించిన సమాచారం ప్ర

Advertiesment
Parijat
, సోమవారం, 29 జనవరి 2018 (11:46 IST)
దశావతారాలలో పరిపూర్ణమైన అవతారాల్లో రామావతారం, కృష్ణావతారం కీలకం. సాక్షాత్తూ ఆ భగవంతుడే మానవుడిగా జీవించి ధర్మానికి ప్రతిరూపంగా నిలిచింది రామావతారం అయితే, మానవత్వంలో దైవత్వాన్ని చూపించింది కృష్ణావతారం. యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని ప్రకటిస్తూ తాను ఏది ఆచరిస్తే అదే ధర్మం అంటూ జగద్గురువుగా నిలిచినవాడు శ్రీకృష్ణుడు.
 
అలాంటి శ్రీకృష్ణుడు సత్యభామ కోసం పారిజాత పుష్పాన్ని దేవలోకం నుంచి తీసుకొచ్చిన కథ తెలిసిందే. ఈ పారిజాత వృక్షం యూపీలోని బారబంకి జిల్లాలోని కింటూరు గ్రామం వద్ద వుంది. ఈ పారిజాత వృక్షానికి సంబంధించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ పారిజాత వృక్షం గురించి వైరల్ అవుతున్న సమాచారం ఏంటంటే..
 
ప్రపంచంలోకెల్ల విలక్షణమైన వృక్షంగా పారిజాత వృక్షాన్ని శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఈ వృక్షపు శాఖ ముక్కలు నుండి పునరుత్పత్తి గాని, పండ్లు గాని ఉత్పత్తి చేయదు. అందుకే ఈ వృక్షం ఒక ప్రత్యేక వర్గంలో ఉంచబడింది. ప్రపంచంలోని ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత ఈ వృక్షం స్వంతం. దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు, చేతి ఐదు వేళ్ళను పోలి ఉంటాయి. 
 
పై భాగాన ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి. వీటి పుష్పాలు కూడా చాలా అందంగా బంగారు రంగు, తెలుపు రంగులో కలిసిన ఒక ఆహ్లాదకరమైన రంగులో ఉంటాయి. పుష్పాలు ఐదు రేకులు కలిగి ఉంటాయి. చాలా అరుదుగా ఈ వృక్షం వికసిస్తుంది. ఈ వృక్షపు గొప్పతనం ఏంటంటే.. దీని శాఖలు గాని ఆకులు గాని కుంచించుకుపోయి కాండంలో కలిసిపోవటమే కాని ఎండిపోయి రాలిపోవటం జరగదు. జూన్-జూలలో మాత్రమే ఈ పుష్పాలు వికసిస్తాయి. ఈ పుష్పాల సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. ఈ వృక్షం సుమారు 1000 నుంచి 5000 సంవత్సరాలుగా చెప్పబడుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోమవారం మీ రాశి ఫలితాలు.. స్త్రీల తొందరపాటుతో చికాకులు తప్పవు..