Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తన కలిమియే ఇంద్ర భోగము లేమియే సర్వలోక దారిద్రంబు

gold
, మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (22:15 IST)
ఒక ఊరిలో రాజావారుండేవారు. ప్రతిరోజూ క్షురకుడు వచ్చి రాజావారికి గెడ్డం గీసి వెళ్లడం ఆనవాయితీ. గెడ్డం గీస్తున్నంతసేపూ క్షురకుడు రాజావారితో ఆ ఊళ్లో కబుర్లు చెప్పడమూ, ఆయన సరదాగా వినడమూ ఇలాగ జరిగిపోతుండేది. ప్రతిరోజూ డబ్బు గురించి మంచి సంగతులు మాత్రమే చెబుతుండేవాడు క్షురకుడు.

 
ఎల్లప్పుడూ మంచి సంగతులే చెపుతున్నావేమిటి? అని రాజావారు అతణ్ణి అడిగారు ఒకరోజున. మరి మంచి సంగతులంటే మంచినే కదా, నేను చెపుతాను" అంటూ వుండేవాడు. ఇలా వుండగా ఒకరోజు గెడ్డం చేస్తూ క్షురకుడు తన కత్తుల పొదిన అక్కడే వుంచి బయటకు వెళ్లాడు. అప్పుడు రాజావారు ఏమి చేసారంటే ఆ పొది అరను లాగారు. అందులో కోడిగుడ్డంత బంగారం వుండ కనిపించింది.

 
ఇదా సంగతి... అని ఆ రాజావారు బంగారం గుడ్డును తీసి మళ్లీ ఎప్పటిలానే అక్కడే పెట్టి సర్దివేసారు. మర్నాడు ఉదయమే మామూలుగా క్షవరం చేయడానికి రాజావారి దగ్గరికి క్షురకుడు వచ్చాడు. ఈసారి... "మన ఊళ్లో దొంగలు పడ్డారు. పరిస్థితులు ఏమీ బాగాలేవు." అంటూ విచారం వెళ్లగక్కాడు.

 
అప్పుడు రాజావారు తాను తీసిపెట్టిన బంగారు గుడ్డును తిరిగి ఇచ్చి వేస్తూ మనిషి తాను బాగుంటే ప్రపంచమంతా బాగు. లేకపోతే ప్రపంచమంతా చెడ్డ అనేది మానవ సహజం అని అర్థం స్పురించో.. తన కలిమియే ఇంద్ర భోగము లేమియే సర్వలోక దారిద్రంబున్ అన్న సుమతి నీతిని అతడికి బోధించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12-04-22 మంగళవారం రాశిఫలాలు - సింధూర అర్చన చేసినా సర్వదా శుభం...