ఆ రోజు పురుషులు తలంటు స్నానం చేస్తే అనుకోని ఆపదలు... స్త్రీలకు ఐశ్వర్యం ఎప్పుడు?
సాధారణంగా ఆడవాళ్ళు అందరు శుక్రవారం నాడు తలస్నానం చేయటం అనేది జరుగుతుంది. ఆడపిల్ల లక్ష్మి దేవితో సమానం కాబట్టి మన పెద్దవాళ్ళు మనకు శుక్రవారం అలవాటు చేసారు. కానీ ధర్మశాస్త్రాల ప్రకారం ఆడవాళ్ళు శుక్రవారం
సాధారణంగా ఆడవాళ్ళు అందరు శుక్రవారం నాడు తలస్నానం చేయటం అనేది జరుగుతుంది. ఆడపిల్ల లక్ష్మి దేవితో సమానం కాబట్టి మన పెద్దవాళ్ళు మనకు శుక్రవారం అలవాటు చేసారు. కానీ ధర్మశాస్త్రాల ప్రకారం ఆడవాళ్ళు శుక్రవారం లేదా మంగళవారం తలస్నానం చేయకూడదు. ఎంతో తప్పనిపరిస్థితి అయితేనే చేయాలి. ఆడవాళ్ళు ముఖ్యంగా తమ జీవితంలో పసుపు కుంకాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తారు. సౌభాగ్యం కలకాలం చల్లగా ఉండాలంటే తలస్నానం చేసే విధానం, ఎప్పుడు చేయాలి అనేది తెలిసి ఉండాలి.
స్త్రీలు శనివారం తలంటు స్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది. బుధవారం చేస్తే భార్యభర్తల మధ్య ఐక్యత బాగుంటుంది. సోమవారం తలంటు చేస్తే సౌభాగ్యవంతులుగా ఉంటారు. తప్పనిసరిగా భోజనానికి ముందే తలంటు స్నానం చేయాలి. ప్రతి స్త్రీ తలంటు స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా ఒంటికి నూనె రాసుకుని, ముఖానికి పసుపు రాసుకుని, నలుగు పెట్టుకుని చేయాలి. ఆ రోజు ఇంటికి ఎవరైనా ముత్తైదువ వస్తే ఆమెకు నుదుటిన కుంకుమ పెట్టి కొంచెం పసుపు, కుంకుమ, 2 మట్టి గాజులు ఇస్తే మంచిదని అంటారు.
పురుషులు ఆయా వారాలలో చేసే తలంటు స్నానాలు ఆయా ఫలితాలను ఇస్తాయి. శనివారం తలంటు స్నానం చేస్తే మహా భోగం కలుగుతుంది. ఆదివారము తలంటు స్నానం చేస్తే తాపాన్ని, కోర్కెలని పెంచుతుంది. సోమవారము తలంటు స్నానం అందాన్ని మరింతగా పెంచుతుంది. మంగళవారము తలంటు స్నానము విపరీత దుఃఖాలకి కారణమవుతుంది. బుధవారం తలంటు స్నానం లక్ష్మి దీవెనలు తప్పక లభిస్తాయి. గురువారం నాడు తలంటు స్నానము చెయ్యటం ద్వారా ఆర్ధిక నష్టములు విపరీతముగా ఉండుట జరుగును. శుక్రవారం తలంటు అనుకోని ఆపదలు సంభవిస్తాయి. ఈ అంశాలకు అనుగుణంగా స్త్రీ – పురుషులు తలంటు స్నానాన్ని ఆచరించాలి.