Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధర్మరాజు లేని సమయలో శ్రీకృష్ణుడిని నలుగురు పాండవులు అలా అడిగారు...

ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారట. శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు. నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్లి ఆ బాణాలను తెమ్మన్నాడు. నలుగురు పాండవులు తలో దిక్కుగ

Advertiesment
ధర్మరాజు లేని సమయలో శ్రీకృష్ణుడిని నలుగురు పాండవులు అలా అడిగారు...
, మంగళవారం, 30 మే 2017 (14:53 IST)
ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారట. శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు. నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్లి ఆ బాణాలను తెమ్మన్నాడు. నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణాలను వెతుక్కుంటూ వెళ్లారు. 
 
అర్జునుడికి బాణం దొరికింది. ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు. ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికున్న ఒక కుందేలును పొడచుకు తింటోంది. అర్జునుడు నివ్వెర పోయాడు. తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. భీముడికి బాణం దొరికినచోట నిండుగా నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండిపోయిన బావి కనిపించింది. ఆశ్చర్య పోయాడు. కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు.
 
నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగదూడను గాయాలయ్యేంతగా విపరీతంగా నాకుతోంది. చుట్టూ వున్న జనం అతి కష్టమ్మీద ఆవు దూడలను విడదీశారు. నకులుడికి ఆశ్చర్యమేసింది. వెనుదిరిగాడు.
 
ఇక సహదేవుడికి బాణం దొరికినచోట ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. సహదేవుడికి అర్థం కాలేదు. నలుగురూ కలిసి శ్రీకృష్ణుని తమ సందేహాలు అడిగారు.   
 
ఆయన చెప్పనారంభించాడు. కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న రీతిగా భక్తులను దోచుకుంటారు. కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చేయరు. కలియుగంలో ఎలాగైతే ఆవుదూడకు గాయాలయ్యేంతగా నాకిందో తలిదండ్రులు తమ పిల్లలను గారం చేసి వాళ్ల జీవితాల్ని నాశనం చేస్తారు. కలియుగంలో జనులు మంచి నడవడిక కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొర్లినట్లుగా పతనం అవుతారు. భగవన్నామమనే చిన్న మొక్క తప్ప ఎవరూ కాపాడలేరని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శని దోషాలు తొలగిపోవాలంటే.. హనుమంతునికి వెన్నతో?