Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇది మీరు అడుగుపెట్టిన పరుగు పందెం కాదు... సద్గురు సందేశం

ఒకసారి శంకరన్ పిళ్లై సెప్టిక్ ట్యాంకులో జారి పడిపోయారు. అప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలుసు. యాతన పడ్డాడు. వంటినిండా మలినం మరికొంత ఇబ్బందితో అరవడం మొదలుపెట్టాడు. ఫైర్.. ఫైర్.. ఫైర్.. పొరుగువారు విని వెంటనే 911కి ఫోన్ చేశారు. అప్పుడు వాళ్లు వచ్చారు. సైరన్

Advertiesment
sadguru
, శుక్రవారం, 5 ఆగస్టు 2016 (21:52 IST)
ఒకసారి శంకరన్ పిళ్లై సెప్టిక్ ట్యాంకులో జారి పడిపోయారు. అప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలుసు. యాతన పడ్డాడు. వంటినిండా మలినం మరికొంత ఇబ్బందితో అరవడం మొదలుపెట్టాడు. ఫైర్.. ఫైర్.. ఫైర్.. పొరుగువారు విని వెంటనే 911కి ఫోన్ చేశారు. అప్పుడు వాళ్లు వచ్చారు. సైరన్లు మోగించుకుంటూ వచ్చారు. పిళ్లై అరుస్తూనే ఉన్నాడు. అరుపు వినేవైపు వెళ్లి పిళ్లై మలినంలో ఉండటాన్ని చూచారు. అగ్నిమాపక దళం వారెవరూ అతడిని తాకడానికి ఇష్టపడలేదు. ఒక కొక్కెం అతని బెల్టుకు తగిలించి బయటకు లాగారు. అప్పుడు వాళ్లు అడిగారు... ఇంతకూ మంటలు ఎక్కడ అని. శంకర్ పిళ్లై తాపీగా ఇలా అన్నాడు. పెంట.. పెంట అని అరిస్తే మీరు వచ్చేవారా... కాబట్టి సరైన సమయంలో సరైన పని చేయాలి. లేకపోతే సహాయం అందదు అని. 
 
సరైన పనిచేయడం అంటే జరగవలసినదాన్ని అనుమతించడమే. ఇది మీరు అడుగుపెట్టిన పరుగు పందెం కాదు. మీలో మీరు స్థిరపడటం. ఇది సంభవం కావాలంటే ఒక స్థాయి నుంచి మరోస్థాయికి కదలడానికి, మీరు అవగాహనతో కదలలేరు. ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మీ అనుభవంలోకి రాని దానిని దేనినీ మీరు అర్థం చేసుకునే మార్గమూ లేదు. విశ్లేషించనూలేరు. ఈ విషయం ప్రతి మనిషికి స్పష్టం కావాలి.
-సద్గురు జగ్గీ వాసుదేవ్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తితిదే ఆన్‌లైన్‌లో శ్రీవారి సేవా టికెట్ల విడుదల - మొత్తం 40,087