Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

RIP అనే పదం వాడేస్తుంటారా? అయ్యో... అది వాడ‌కూడ‌ద‌ట‌....

ఫలానా వ్యక్తి మరణించారనే వార్త ఫేస్ బుక్ లేదా ట్విట్టర్‌లో చూసిన వెంటనే మనం RIP అని కామెంట్ పెట్టడం అలవాటుగా మారింది. కానీ, అస‌లు ఆ ప‌దం వాడ‌కూడ‌ద‌ట‌. నిజంగా మనం RIP అని ఎందుకు రాస్తున్నామో తెలియకుండానే గుడ్డిగా అనుసరిస్తున్నాం. అసలు దీనికి అర్థమేమిట

RIP అనే పదం వాడేస్తుంటారా? అయ్యో... అది వాడ‌కూడ‌ద‌ట‌....
, గురువారం, 22 సెప్టెంబరు 2016 (16:49 IST)
ఫలానా వ్యక్తి మరణించారనే వార్త ఫేస్ బుక్ లేదా ట్విట్టర్‌లో చూసిన వెంటనే మనం RIP అని కామెంట్ పెట్టడం అలవాటుగా మారింది. కానీ, అస‌లు ఆ ప‌దం వాడ‌కూడ‌ద‌ట‌. నిజంగా మనం RIP అని ఎందుకు రాస్తున్నామో తెలియకుండానే గుడ్డిగా అనుసరిస్తున్నాం. అసలు దీనికి అర్థమేమిటని త‌ర‌చి త‌ర‌చి చూస్తే... RIP అంటే Rest in peace అని అర్థం. క్రైస్తవం ప్రకారం మరణించాక, జడ్జిమెంట్ డే వరకు ఆత్మ నిరీక్షించాలి. ఇస్లాం ప్రకారం కూడా ఒక రోజు వరకు నిరీక్షించాలి. ఆ రోజు వరకూ ఈ ఆత్మ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని మనం ఈ RIP ద్వారా కోరుతున్నాం. 
 
మరి సనాతన ధర్మం ప్రకారం ఆత్మ నాశనం లేనిది. ఆత్మకు అలసటే లేదు. అలాంటప్పుడు విశ్రాంతి ఎక్కడ? అలాగే మరణానంతరం జీవి పాపపుణ్యాల్ని బట్టి, తరువాతి జన్మ పొందడమో, స్వర్గ నరకాలకు వెళ్ళడమో, మోక్షానికి వెళ్ళడమో వంటి ప్రతి చర్యలుంటాయి. మోక్షం వరకూ ఇది ఒక చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది. అంతేకానీ మనం ఏ రోజు గురించి నిరీక్షించాల్సిన అవసరం లేదు. 
 
RIP అనేది పూర్తిగా పాశ్చాత్యమే కాక, మతాంతరం కూడా. మరణించిన వ్యక్తికి ముక్తి కలగాలనో, లేక స్వర్గస్తుడవ్వాలనో, శాశ్వత పుణ్య లోకాలు కలగాలనో మనం ప్రార్థించాలే తప్ప, RIP అని ప్రార్థించడం సనాతన ధర్మానికి వ్యతిరేకమని గుర్తించాలి. స్వ‌ర్గ ప్రాప్తిర‌స్తు అనుకోవాలి గాని, ఇలా రిప్ పెట్ట‌కూడ‌ద‌ట‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జన్మ తేదీలను, సకల శుభకార్యాలను అనుసరించి వెలిగించాల్సిన వత్తులు