Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జన్మ తేదీలను, సకల శుభకార్యాలను అనుసరించి వెలిగించాల్సిన వత్తులు

వెండి ప్రమిదల్లో నేతితో కాని కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ పొద్దుతిరుగుడు నూనెతో దీపారాధన చేస్తే వారికి వారి ఇంట్లో వారికి అష్టసిద్ధులు కలుగును. గణపతిని లక్ష్మినారాయణ స్వామికి లలితాత్రిపుర సుందరీ దేవికి, రాజ రాజేశ్వరి అమ్మ వారికి సాల గ్రామమ

జన్మ తేదీలను, సకల శుభకార్యాలను అనుసరించి వెలిగించాల్సిన వత్తులు
, గురువారం, 22 సెప్టెంబరు 2016 (14:03 IST)
వెండి ప్రమిదల్లో నేతితో కాని కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ పొద్దుతిరుగుడు నూనెతో దీపారాధన చేస్తే వారికి వారి ఇంట్లో వారికి అష్టసిద్ధులు కలుగును. గణపతిని లక్ష్మినారాయణ స్వామికి లలితాత్రిపుర సుందరీ దేవికి, రాజ రాజేశ్వరి అమ్మ వారికి సాల గ్రామములకు శ్రీ గాయత్రీమాతకు గాని, వెండి ప్రమిదల్లో వత్తులను వేసి దీపారాధన చేస్తారో వారు అనుకున్న పనులన్నీ వెంటనే సకాలంలో పూర్తవుతాయి. ఆయా జన్మతేదీలను అనుసరించి వత్తులను వెలిగించి దీపారాధన చేయాలి.
 
మార్చి 21 నుండి ఏప్రిల్‌ 20 తేదీల మధ్య జన్మించిన వారు – (5) పంచవత్తులు, ఏప్రిల్‌ 21 నుండి మే 20 తేదీల మధ్య జన్మించిన వారు – (7) సప్తవత్తులు, మే 21 నుండి జూన్ 20 తేదీల మధ్య జన్మించిన వారు – (6) షణ్మవత్తులు, జూన్ 21 నుండి జూలై 20 తేదీల మధ్య జన్మించిన వారు – (5) పంచముఖి వత్తులు, జూలై 21 నుండి ఆగష్టు 20 వరకు – (3) త్రివత్తులు, ఆగష్టు 21 నుండి సెప్టెంబరు 20 మధ్య తేదీలలో జన్మించినవారు – (6) షణ్మఖ వత్తులు, సెప్టెంబరు 21 నుండి అక్టోబరు 20 మధ్య తేదీలలో జన్మించినవారు – (7) సప్త వత్తులు, అక్టోబరు 21 నుండి నవంబరు 20 మధ్య తేదీల మధ్య జన్మించినవారు – (2) ద్వి వత్తులు వెలిగించాలి.
 
నవంబర్ 21 నుండి డిసెంబరు 20 తేదీల మధ్య జన్మించినవారు –(5) పంచమ వత్తులు, డిసెంబర్ 21 నుండి జనవరి 20 తేదీల మధ్య జన్మించినవారు – (6) షణ్ముక వత్తులు, జనవరి 21 నుండి ఫిబ్రవరి 20 తేదీల మధ్య జన్మించిన వారు  - (5) షణ్మక వత్తులు, ఫిబ్రవరి 21 నుండి మార్చి 20 తేదీల మధ్య జన్మించినవారు – (2) ద్వి వత్తులు వెలిగించాలి.
 
సకల శుభ కార్యములకు వెలిగించవలసిన వత్తులు:-  ఆరోగ్యము కొరకు – (1) ఏకవత్తి లేదా ద్వాదశ వత్తులు, మానసిక రోగములు నివారణకు – (2) ద్వి వత్తులు, వివాహ ప్రాప్తికొరకు – (3) త్రి వత్తులు, కుజ దోష నివారణకు – (3) త్రి వత్తులు, విద్యాప్రాప్తి కొరకు – (4) చతుర్‌ వత్తులు, ఉద్యోగ ప్రాప్తి కొరకు – (5) పంచమ వత్తులు, ఋణ బాధలు తీరుటకు – (6) షణ్ముక వత్తులు, వ్యాపారాభివృద్ధి కొరకు – (6) షణ్ముక వత్తులు, ఏలినాటి అష్టమ శని కొరకు – (7) సప్త వత్తులు, సర్వదోష నివారణ – (8) అష్టమ వత్తులు, సంతానప్రాప్తి కొరకు – (9) నవమి వత్తులు, అపమృత్యుదోష నివారణకు – (10) దశమ వత్తులు, ధనప్రాప్తి కొరకు – (12) ద్వా దశ వత్తులు,  నాయకత్వము కొరకు – (14) చతుర్దవ వత్తులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీతం డబ్బుతో శుక్రవారం ఉప్పు కొనుగోలు చేస్తే....