Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధనవంతులు కావాలంటే.. ఇంట్లో ఈ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లో పెట్టుకోకూడదు..!!

ప్రతి ఒక్కరికీ ధనవంతులు కావాలనే ఆశ ఉంటుంది. కొందరు అహర్నిశలు కష్టపడి ధనవంతులు అవుతారు. మరికొందరు ఏ ఒక్క ప్రయత్నం చేయకుండా తమ అదృష్టంపై ఆధారపడుతుంటారు. ఇంకొందరు ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకోవడం వల్ల

Advertiesment
Riches
, శనివారం, 31 డిశెంబరు 2016 (12:24 IST)
ప్రతి ఒక్కరికీ ధనవంతులు కావాలనే ఆశ ఉంటుంది. కొందరు అహర్నిశలు కష్టపడి ధనవంతులు అవుతారు. మరికొందరు ఏ ఒక్క ప్రయత్నం చేయకుండా తమ అదృష్టంపై ఆధారపడుతుంటారు. ఇంకొందరు ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకోవడం వల్ల తమ దశ తిరుగుతుందని భావిస్తారు. 
 
అయితే, మరికొందరు ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకుంటే ధనవంతులుగా మారిపోతారని భావిస్తుంటారు. ఇదేవిషయాన్ని కూడా పెద్దవాళ్లు సూచన చేస్తుంటారు. కానీ కొన్ని వస్తువులు మాత్రం చాలా హానికరమట. వాటిని పెట్టుకోవడం వల్ల ఇంటికి మంచిది కాదు. అలాగే పేదరికం వెంటాడుతుందని చెబుతోంది వాస్తుశాస్త్రం. అయితే ఇలాంటి విషయాలను చాలా మంది మూఢనమ్మకంగా భావిస్తారు.
 
సాలేడు పురుగు పేర్చే గూడుని చాలామంది మంచిదని భావిస్తారు. కానీ.. ఇది జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే ఆర్థిక సమస్యలకు సంకేతం. కాబట్టి వెంటనే.. దాన్ని తొలగించి.. ఇంటిని శుభ్రం చేసుకోండి.
 
ఇంట్లో పాపురం గూడు ఉండటం వల్ల.. వెంటనే ఇంట్లో ధనం తగ్గిపోయి.. ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. ఒకవేళ మీ ఇంట్లో మీకు తెలియకుండానే పావురం గూడుపెట్టుకుని ఉంటే.. వెంటనే తొలగించండి.
 
తేనెటీగలు పేర్చే తేనె తెట్ట ఇంట్లో ఉండే చాలా డేంజర్ అని గుర్తించండి. ఇవి మనకు హానికరమే కాదు.. దురదృష్టానికి కారణమవుతుంది. ఒకవేళ మీ ఇంటి ఆవరణలో ఇది ఉంటే.. వెంటనే తొలగించండి
 
పగిలిపోయిన అద్దాలు వాస్తు ప్రకారమే కాదు.. నెగటివ్ ఎనర్జీని కూడా ఇంట్లోకి ఆహ్వానిస్తారు. అలాగే దారిద్య్రాన్ని ఆహ్వానిస్తాయి. కాబట్టి.. పగిలిపోయిన అద్ధం ఇంట్లో ఉంటే వెంటనే బయటపడేయండి.
 
చాలామంది ఇంటిపైకప్పును డంపింగ్ యార్డ్‌లా మార్చేస్తుంటారు. పాత ఫర్నిచర్, పాత వస్తువులన్నింటినీ.. ఇంటి మేడపై పడేస్తారు. టెర్రస్‌ని ఇలా మార్చడం వల్ల.. దురదృష్టం ఎదురవుతుంది, పేదరికం పట్టిపీడిస్తుంది. వెంటనే దాన్ని శుభ్రం చేసుకుంటే మంచిదని వాస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముగ్గుల్ని తొక్కకూడదు.. నక్షత్రం, స్వస్తిక్, శ్రీ గుర్తులేస్తే? తులసి దగ్గర ఏ ముగ్గు వేయాలి?