కార్తీక మాసంలో నవగ్రహ దీపాల నోమును ఆచరిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెప్తున్నారు. ఈ నోమును మూడురోజుల పాటు చేయవలసి ఉంటుంది. ముందుగా ఆదిభగవానుడైన గణపతిని పూజించాలి. ఆ తరువాతనే శివునికి పూజ చేయాలని పు
Advertiesment
, బుధవారం, 3 అక్టోబరు 2018 (14:42 IST)
కార్తీక మాసంలో నవగ్రహ దీపాల నోమును ఆచరిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెప్తున్నారు. ఈ నోమును మూడురోజుల పాటు చేయవలసి ఉంటుంది. ముందుగా ఆదిభగవానుడైన గణపతిని పూజించాలి. ఆ తరువాతనే శివునికి పూజ చేయాలని పురాణం చెబుతోంది. ఈ నవగ్రహాల నోమును ఎలా చేయాలంటే.. మెుదటగా నవధాన్యాలతో దీపారాధన చేయాలి.
దీపారాధన ఎలా చేయాలంటే.. నవధాన్యాలను కొద్దికొద్దిగా తీసుకుని వాటిపై దీపాలు పెట్టుకుని ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ దీపారాధన చేయాలి. తరువాత అమ్మవారికి ఇష్టమైన స్తోత్ర పారాయం చేసి తొమ్మిదిమంది బ్రాహ్మణులకు ఆ నవధాన్య దీపాలను ఇవ్వాలి. ముఖ్యంగా ఈ నోమును సాయంత్రం వేళలోనే చేయాలని పండితులు చెబుతున్నారు.
నోము ఆచరించిన తరువాత అక్షంతలను ఇంటి ఈశాన్య ప్రాంతంలో చల్లి, ఆ తరువాత కుటుంబంలోని సభ్యుల శిరస్సుపై చల్లుకోవాలి. ఈ నోము మూడురోజుల పాటు ఆచరించడం వలన సిరిసంపదలు, సంతోషాలు చేకూరుతాయని చెప్తున్నారు.