దశమి నాడు కలశ పూజ ఎలా చేయాలో తెలుసా..?
దశమి అంటే గుర్తుకు వచ్చేవారు అమ్మవారే. అమ్మవారికి దుర్గాదేవి, పార్వతీదేవి అనే రకరకాల పేర్లు గలవు. శివుడు లేనిదే పార్వతీ లేదు. కనుక వీరిద్దరిని సమానంగా పూజించాలి. గణపతి, సుబ్రహ్మణ్య, అయ్యప్ప వారు శివపా
దశమి అంటే గుర్తుకు వచ్చేవారు అమ్మవారే. అమ్మవారికి దుర్గాదేవి, పార్వతీదేవి అనే రకరకాల పేర్లు గలవు. శివుడు లేనిదే పార్వతీ లేదు. కనుక వీరిద్దరిని సమానంగా పూజించాలి. గణపతి, సుబ్రహ్మణ్య, అయ్యప్ప వారు శివపార్వతులకు కూమారులు. విజయదశమి నాడు దుర్గాదేవిని పూజించడం వలన సకల సౌభాగ్యాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు.
విజయదశమి పండుగ ఎలా చేయాలంటే.. గంగాజలంతో నిండిన కలశాన్ని ఏర్పాటుచేసుకుని దాన్ని తెల్లటి నూలు దారాన్ని చుట్టి లేత మామిడి ఆకులను దానికి కట్టుకుని చివరగా పై భాగంలో కొబ్బరికాయను పెట్టాలి. ఆ తరువాత కలశానికి, కొబ్బరికాయకు పసుపు, కుంకుమలు పెట్టి అలంకరించుకోవాలి.
అరటి ఆకు తయారుచేసుకుని అందులో బియ్యం పోసి దానిపై కొబ్బరికాయ కలశాన్ని పెట్టాలి. అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగలిని పెట్టి కూర్పూర హారితినిచ్చి భక్తిశ్రద్ధలతో పూజించాలి. దశమి ''నమోభగవత్త్యె దశపాపహరాయై గంగాయై, నారాయణ్యై, రేవత్త్యె, శివాయై దక్షాయై అమృతాయై విశ్వరూపిణ్యై నందిన్యైతే నమోనమః" అనే మంత్రాన్ని జపిస్తే సకల సంపదలు చేకూరుతాయని పురాణాలలో చెప్పబడింది.