పరమేశ్వరుని అనుగ్రహంతో.. సమస్త దోషాలు పటాపంచలు...
పరమశివుడు భక్తుల పాలిట కామధేనువు, కల్పవృక్షం. ఈ స్వామివారి నామాన్ని స్మరిస్తే ప్రీతి చెందుతాడు. భక్తిశ్రద్ధలతో ప్రార్ధిస్తే చాలు భక్తులు కోరిక వరాలను వెంటనే ప్రసాదిస్తాడు. సోమవారం అంటే స్వామివారికి ఎం
పరమశివుడు భక్తుల పాలిట కామధేనువు, కల్పవృక్షం. ఈ స్వామివారి నామాన్ని స్మరిస్తే ప్రీతి చెందుతాడు. భక్తిశ్రద్ధలతో ప్రార్ధిస్తే చాలు భక్తులు కోరిక వరాలను వెంటనే ప్రసాదిస్తాడు. సోమవారం అంటే స్వామివారికి ఎంతో ప్రియమైన రోజు. ఆ రోజున స్వామివారికి పూజలు, అభిషేకాలు చేయవలసి ఉంటుంది. దాంతో శివుడు ప్రీతి చెందుతారు.
మాస శివరాత్రి రోజున సాయంత్రం వేళ స్వామివారికి అభిషేకాలు చేసి బిల్వదళాలతో పూజించాలి. పగలంతా ఉపవాస దీక్షను చేపట్టి, రాత్రంతా శివ నామ స్మరణ చేస్తూ జాగరణ చేయాలి. ఈ విధంగా చేయడం వలన సమస్త దోషాలు తొలగిపోయి పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలలో చెప్పబడింది.