Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తేనెటీగలు కుట్టినట్లు కల వస్తే ఏమవుతుందో తెలుసా..?

Advertiesment
bees
, శనివారం, 2 మార్చి 2019 (11:56 IST)
కలలు మానవ నైజం, చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరూ కలలు కంటారు. ఇప్పుడు మాట్లాడుకునేది జీవితంలో ముందుకు ఎలా ఎదగాలో, ఎటువంటి పనులను చేపట్టాలోనని పథకాలు వేసుకునే పగటి కలల గురించి కాదు.. మనం మాట్లాడుకునేది నిద్రపోయే సమయంలో కనే కలలను గురించి.

కలల స్వరూపం ఏమిటని ప్రశ్నించుకుంటే వచ్చే జవాబు అవి మానసిక స్థితికి ప్రతిరూపాలేనని... సంతోషంగా ఉన్నప్పుడు పడుకుంటే వచ్చే కలలు ఒకలా ఉంటాయి. ఇదే విషాదంగా ఉన్నప్పుడు పడుకుంటే వచ్చే కలలు మరోలా ఉంటాయి. మరి ఆ కలల్లో కనిపించే పలు దృశ్యాలు ఏం చెబుతున్నాయి.. వాటి వలన వచ్చే లాభనష్ట ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం.
 
మెరుపు మెరిసినట్లు, ఉరుములు ఉరిమినట్లు, పిడుగు పడినట్లు, తల దువ్వుకుంటున్నట్లు, ఇంట్లో నక్షత్రం ప్రకాశిస్తున్నట్లు, కట్లు ఉన్న కాళ్లతో నడిచినట్లు, కాలు విరిగినట్లు కలలు రావడం మంచిది కాదు. కుక్క తమను చూచి మొరిగినట్లు, నక్క, కోతి కనిపించినా, పక్షిగుడ్లను పగులగొట్టినట్లు, తడిసి ఉన్న గోడపై నడిచినట్లు, పిల్లిని చంపినట్టు, జంతువులు కరిచినట్లు, తేనెటీగలు కుట్టినట్లు, ఎగురుతున్నట్లు, గాడిద పైకి ఎక్కినట్లు, మృతులను చూసినట్లు, గుడ్లగూబలు అరిచినట్లు, చెట్టు ఎక్కి అన్నం తిన్నట్టు కలలు వచ్చినా నిజ జీవితంలో మంచి జరగదట.
 
పరిచయం లేని స్త్రీతో వెళ్ళుతున్నట్లు, దిగంబరంగా ఉన్నట్లు, ఆవు పేడతో ఇల్లు అలికినట్లు, పిల్లలు మరణించినట్లు, సూర్యాస్తమయం, మబ్బుల వెనుకనున్న సూర్యుడు, సూర్యకిరణాలు తమ పక్క మీద పడినట్లు, ఎర్రని పూలు, గాడిదలు నడుపుతున్న బండి ఎక్కినట్లు, ఊబిలో కూరుకుపోయినట్లు, ప్రత్తి చెట్లు, పూలు పూయని చెట్లు, చుట్టూ గ్రద్దలు ఎగురుతున్నట్లు, ముఖముపై పక్షులు పొడిచినట్లు, బంగారం లేదా వెండి ముద్దలు, పంది, నక్క, పులి, గాడిద, దయ్యములు మొదలగు వాటిపై ఎక్కి వెళుతున్నట్లు, క్రింద పడిన ఆకులు, వక్కలను ఏరుకున్నట్లు, గడ్డము, మీసం గొరిగించుకున్నట్లు, నారింజ, దబ్బ, నిమ్మ, పనసకాయలు తినినట్లు స్వప్నాలు రావడం మంచిది కాదట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

02-03-2019 - శనివారం మీ రాశి ఫలితాలు..