Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోవిందా గోవిందా అంటూ చేతులెత్తి దండం పెడితే ఏమేమి జరుగుతుందో తెలుసా...?

తిరుమల వెంకన్నకు మనసారా చేతులెత్తి దండం పెడితే గత జన్మలోను, రాబోయే జన్మలో పాపం నశిస్తుందట. కలియుగంలోగానీ, ఏ యుగంలోగానీ ఏది కావాలన్నా శ్రీవారినే ప్రార్థించాలని పురాణాలు చెబుతున్నాయి.

Advertiesment
Lord Venkateswara
, శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (13:47 IST)
తిరుమల వెంకన్నకు మనసారా చేతులెత్తి దండం పెడితే గత జన్మలోను, రాబోయే జన్మలో పాపం నశిస్తుందట. కలియుగంలోగానీ, ఏ యుగంలోగానీ ఏది కావాలన్నా శ్రీవారినే ప్రార్థించాలని పురాణాలు చెబుతున్నాయి. భక్తుల కోరికలు తీర్చేందుకే స్వామివారు తిరుమళిశై ఆళ్వారు, భక్తులకు ఆనందాన్ని పంచి ఇవ్వడానికే భగవంతుడు అర్చనామూర్తిగా వేంకటేశ్వరుడై నిలిచి ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు శాశ్వతంగా తిరువేంగడంలో నిలిచి ఉన్న శ్రీ వేంకటేశ్వరుని దివ్యపాద సౌందర్యాన్ని దర్శించాలని కూడా పెద్దలు చెబుతుంటారు.
 
పరమ వైష్ణవ శిరోమణి అయిన నమ్మాళ్లులు శ్రీ వేంకటపతికి చేతులెత్తి దండం పెడతారు. అన్నీ ఆయనే చూసుకుంటారని పండితులే చెబుతుంటారు. కులశేఖరాళ్వారు సాక్షాత్తు వేంకటాచల పర్వత సానువుల్లో చెట్టుగాను, పుట్టగాను, అక్కడి పుష్కరిణిలో చేపగాను, కొంగగాను అయి ఉండాలని కోరుతూ మళ్ళా ఆ కోరిక అశాశ్వతం కనుక శాశ్వతంగా శ్రీనివాసుని దరహాస చంద్రికలను చూస్తూ ఉండేటట్లుగా ఆ స్వామివారి ముందు రాయిగా పడి ఉండాలని ఆకాంక్షించాడట. ఈ పరమ భక్తాగ్రేసరుని పేరుతోనే తిరుమల శ్రీస్వామివారు ముందున్న రాతి గడప కులశేఖరపడి అని పిలువబడుతోంది.
 
పెరియాళ్ళారుగా ప్రసిద్ధి చెందిన విష్ణుచిత్తుడు వేంకటాచలపతి సాక్షాత్తు క్రిష్ణుడై అని మైమరచి వర్ణించాడట. తిరుప్పాణాళ్వారు ఓ తిరువేంకటేశా నీ భక్తులకు సేవ చేసే భాగ్యం కలిగించు స్వామి అని ప్రార్థించారని పురాణాలు చెబుతున్నాయి. ఇక తిరుమంగై ఆళ్వారు స్వామీ.. నేనెన్నో పాపాలు చేశాను. నా పాపాలను నీవు మాత్రమే నశింపజేయగలవాడని శ్రీవేంకటేశ్వరస్వామి నామాన్ని జపించారట.
 
ఇక ఆండాళ్‌(గోదాదేవి) తిరుమల గోవిందుని దివ్యమూర్తిని దర్శించి వేయివెలుగులతో ప్రకాశిస్తూ ఉన్న దివ్య శంఖచక్రాలను ధరించి ఉన్న తిరు వేంకటపతికి తాను పూర్తిగా అంకితం అయినానని విన్నవించుకుందట. ఇలా కాలాంతరంలో ఎందరో మహనీయులు, ఎందరెందరో పరమ భక్తులు కోయని పిలిస్తే ఓ యని పలికే ప్రత్యక్ష దైవమని ప్రసిద్ధి పొందిన శ్రీ వేంకటేశ్వరుని మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా అనుభవించి ఆనందించి తరించారు. మనం అందరం కూడా ఇహపర సౌఖ్యాలను లెస్సగా అనుభవించి తరించడానికి అతి సులువైనది, దగ్గరైనది వేంకటాద్రి మార్గం ఒక్కటే అంటూ సన్మార్గోపదేశం చేశారు. చేస్తున్నారు కూడా.
 
ఆ మహనీయులు చూపిన బాటలో ఏ పూర్వపుణ్యం లేశం చేతనో, తెలిసో, తెలియకో మనం అందరం ఆనందనిలయుని సన్నిధిలో నిలిచి ఉంటూ శ్రీ వేంకటేశ్వరుని దివ్యమూర్తి దర్శనాన్ని కన్నులారా చూసుకుంటున్నాం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీరామ ధ్యానశ్లోకాలు చదవండి.. సకల సంపదలను పొందండి..