Publish Date: Sun, 19 Jul 2020 (22:45 IST)
Updated Date: Sun, 19 Jul 2020 (22:46 IST)
దిష్టి. దీన్ని తీసేసేందుకు కొబ్బరికాయలను కొడుతుంటారు. ఐతే కొన్నిసార్లు కొబ్బరికాయ కుళ్లిపోయి వుంటుంది. పూజలో కొట్టిన కొబ్బరికాయ క్రుళ్ళితే దోషం కాదన్నది పండితుల మాట. ఎందుకంటే అది మనం తెలిసి ఇవ్వలేదు కనుక.
దేవాలయాల్లో కొట్టే కొబ్బరికాయ క్రుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్ళతో శుభ్రంచేసి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి స్వామిని అలంకరిస్తారు. అంటే ఆ దోషం క్రుళ్ళిన కొబ్బరికాయదేకాని ఇచ్చిన వ్యక్తిది కాదని ఇందులోని పరమార్థం.
అదేవిధంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ క్రుళ్ళితే క్రుళ్ళిన భాగాన్నితీసేసి కాళ్ళూ, చేతులూ, ముఖమూ కడుగుకొని పూజామందిరాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ పూజ ఆరంభించటం మంచిది. వాహనాలకి కొట్టే కాయ క్రుళ్ళితే దిష్టి అంతా పోయినట్టే. అయినా సరే మళ్ళీ వాహనం కడిగి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలి. అలా చేసినట్లయితే దోషం పోయినట్లవుతుంది.
సిహెచ్
Publish Date: Sun, 19 Jul 2020 (22:45 IST)
Updated Date: Sun, 19 Jul 2020 (22:46 IST)