Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గంగాజలం శక్తి ఎంతో తెలుసా..?!

గంగాజలం గురించి సైన్సు చెబుతున్నదేమిటి. ఆ నది నీటిలో రహస్యాలేంటి. ఒక్క మునకతోనే సమస్త పాపాలు తొలగించే శక్తి పరమ పవిత్రమైన గంగకు ఉందని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి. గంగ మీద ఆధునిక కాలంలో జరిగిన పరిశోధనలు చాలా ఆశ్చర్యపరిచే విషయాలు వెల్లడయ్యాయి.

గంగాజలం శక్తి ఎంతో తెలుసా..?!
, సోమవారం, 2 జనవరి 2017 (21:49 IST)
గంగాజలం గురించి సైన్సు చెబుతున్నదేమిటి. ఆ నది నీటిలో రహస్యాలేంటి. ఒక్క మునకతోనే సమస్త పాపాలు తొలగించే శక్తి పరమ పవిత్రమైన గంగకు ఉందని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి. గంగ మీద ఆధునిక కాలంలో జరిగిన పరిశోధనలు చాలా ఆశ్చర్యపరిచే విషయాలు వెల్లడయ్యాయి. 
 
యాంటి బ్యాక్టీరియల్‌ శక్తి 1896లో ఈ హంబురె హంకిన్‌ అనే బ్రిటీష్‌ వైద్యుడు గంగా జలం మీద పరీక్షలు జరిపి, ఓ ఫ్రెంచి పత్రిక‌లో ఒక పరిశోధన వ్యాసం రాశారు. దాని సారాంశం ప్రాణాంతకమైన కలరా వ్యాధిని కలిగించే బాక్టీరియా విబియో చలేరియేని గంగా నీటలో వేసినప్పుడు అది కేవలం 3 గంటల్లోనే పూర్తిగా నశించింది. అదే బ్యాక్టీరియా శుద్ధి చేయబడిన జలాల్లో 48 గంటల తరువాత కూడా జీవనం కొనసాగించింది. 
 
ఇది మన గంగమ్మ తల్లి శక్తి. సి.ఈ.నీల్సన్‌ అనే బ్రిటీష్‌ వైద్యుడు భారత్‌ నుంచి తిరిగి వెళుతూ గంగా నది ప్రవాహంలో అత్యంత కాలుష్యమైన ప్రదేశమైన హూగ్లీ నుంచి గంగా నీటిని నౌకలో ఇంగ్లాండ్‌ తీసుకువెళ్ళాడు. అంత కలుషితమైనా కూడా గంగ నీరు ఆయన సుదీర్ఘ ప్రయాణంలోనూ, ఆయన ఇంగ్లాండుకు చేరిన తరువాత కూడా ఆ నీరు పరిశుద్ధంగానే ఉంది. 
 
మామూలు నీటిని గాలి చొరబడని సీసాలో పెడితే ప్రాణవాయువు లేని కారణంగా ఆ నీటిలో వాయురహిత బ్యాక్టీరియా వృద్ధి చెంది నీరు వాసన వస్తాయి. ఆ వాసన దాదాపు కుళ్ళిపోయిన వాసనలాగే ఉంటుంది. కానీ గంగనీరు మాత్రం పరిశుద్ధంగానే ఉంటుంది. ఇది గంగకున్న శక్తి. ఇది మనం కూడా గమనించవచ్చు. కాశీ యాత్రకు వెళ్ళినవారు గంగాజలాన్ని ఇంటికి తీసుకువస్తే అది ఎన్ని సంవత్సరములు గడిచినా చెడిపోదు, కుళ్ళువాసన రాదు. ఇది మన హిందువులు పూజించే గంగమ్మ తల్లి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డబ్బులు అక్కడ పెడితే ధనలక్ష్మి జారుకుంటుంది... మరి ఎక్కడ పెడితే తిష్ట వేస్తుంది?