డబ్బులు అక్కడ పెడితే ధనలక్ష్మి జారుకుంటుంది... మరి ఎక్కడ పెడితే తిష్ట వేస్తుంది?
బజారుకెళ్లి కూరగాయలో, ఇంటి సామగ్రినో లేదంటే తినేందుకు ఏమయినా పదార్థాలో కొనుక్కుని మిగిలిన చిల్లరను జేబులో వేసుకుని ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి రాగానే వస్తువుల్ని, పదార్థాలను హాల్లో పెట్టేసి జేబులో ఉన్న చ
బజారుకెళ్లి కూరగాయలో, ఇంటి సామగ్రినో లేదంటే తినేందుకు ఏమయినా పదార్థాలో కొనుక్కుని మిగిలిన చిల్లరను జేబులో వేసుకుని ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి రాగానే వస్తువుల్ని, పదార్థాలను హాల్లో పెట్టేసి జేబులో ఉన్న చిల్లర డబ్బును తీసి ఏ బల్ల పైనో, లేదంటే అలమరాలోనో అదీ కాదంటే డైనింగ్ టేబుల్ మీదనో పెట్టేస్తాం. ఇక స్త్రీల సంగతి చెప్పాల్సి వస్తే... పోపుల డబ్బాల్లో పడేస్తారు. అదీ కాదంటే కూరగాయలు పెట్టుకునే బేసిన్లో ఈ డబ్బులను కూడా కలిపేసి పోసేస్తారు.
ఎప్పుడో అవసరమైనప్పుడు ఆ కూరగాయల పాత్రను కెలికి కింద ఉన్న డబ్బును తీసుకుంటూ ఉంటారు. ఇట్లాంటి పనులు అసలు చేయకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవికి ఇవన్నీ నచ్చవు. డబ్బును ఎక్కడంటే అక్కడ పడవేస్తే ఇంట్లోంచి మెల్లగా ఆమె జారుకుంటుంది. అందుకే డబ్బును ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు. ప్రత్యేకించి కొన్ని దిక్కుల్లో మాత్రమే పెట్టాలి. అప్పుడే ధనలక్ష్మి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది.
అవేంటో ఒక్కసారి చూద్దాం. తూర్పు దిశలో డబ్బును, లాకర్ పెట్టుకోండి. పడమర వైపులో నగలు పెట్టుకోవచ్చు. ఉత్తర దిశగా నగలు, డబ్బు పెట్టుకోవాలి. దక్షిణం వైపు డబ్బు పెట్టకపోవడం మంచిది. బాత్రూం ఎదురుగా డబ్బు అసలు పెట్టకూడదు. అంతేకాదు లాకర్‌లో దుమ్ము ధూళి వుండకూడదు. బీరువాలో కొంతమంది ధనలక్ష్మి బొమ్మను పెట్టుకుంటారు. అలాంటవారు రెండు ఏనుగుల బొమ్మ ఉన్న లక్ష్మీదేవిని మాత్రమే పెట్టుకోవాలి. లివింగ్ రూములో వాటర్ ఫౌంటెయిన్‌ను ఆగ్నేయంలో పెట్టుకుంటే మంచిది. దాని ప్రక్కనే ఆక్వేరియం ఏర్పాటు చేసుకోండి. అందులో డ్రాగన్ ఫిష్ పెట్టుకుంటే సిరిసంపదలు వెల్లివిరుస్తాయి.