Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మన శరీరంలో ఉన్న దివ్యచక్రాల గురించి తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..!

మనిషి శరీరంలోని యోగసాధకులు చక్రాలట. మొత్తం ఆరు చక్రాలు మన శరీరంలో అమరి ఉంటాయట. ఈ చక్రాలు దేవుళ్ళను పోలి ఉంటాయట. శరీరంలోని వివిధ భాగాల్లో ఇవి ఉంటాయి. ఎంతో దివ్యశక్తి కలిగిన దివ్యచక్రాలు ఇవని శాస్త్రాలు చెబుతున్నాయి. అందులో మొట్టమొదటిది మూలాధారం. నల్ల

మన శరీరంలో ఉన్న దివ్యచక్రాల గురించి తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..!
, గురువారం, 24 ఆగస్టు 2017 (19:29 IST)
మనిషి శరీరంలోని యోగసాధకులు చక్రాలట. మొత్తం ఆరు చక్రాలు మన శరీరంలో అమరి ఉంటాయట. ఈ చక్రాలు దేవుళ్ళను పోలి ఉంటాయట. శరీరంలోని వివిధ భాగాల్లో ఇవి ఉంటాయి. ఎంతో దివ్యశక్తి కలిగిన దివ్యచక్రాలు ఇవని శాస్త్రాలు చెబుతున్నాయి. అందులో మొట్టమొదటిది మూలాధారం. నల్ల రంధ్రానికి 200 అంగుళాల దూరంలో ఈ మూలాధారం ఉంటుంది. దీని రంగు ఎర్రగా ఉంటుంది. నాలుగు రేకులు గల తామరపువ్వు ఆకారంలో ఉంటుంది. దీనికి అధిపతి గణపతి. వాహనం ఏనుగు. 
 
సాధిష్టానచక్రం. ఇది జననేంద్రియం వెనుక వెన్నెముక భాగంలో ఉంటుంది. అధినేత బ్రహ్మతత్వం. ఆరురేకులు పద్మాకారంలో ఉంటుంది. మనిపూరక చక్రం. బొడ్డుకు మూలలో వెన్నెముకకు ఇమిడి ఉంటుంది. దానికి అధిపతి విష్ణువు. అనాహత చక్రం.. హృదయం వెనుక వెన్నెముకలో ఉంటుందట.. దీనికి అధిపతి దేవత రుద్రుడు. నీలం రంగులో ఉంటుంది. 
 
12 రేకుల తామర పువ్వులా ఉంటుంది. విశిష్టద చక్రం... కంఠం యొక్క ముడి దగ్గర ఉంటుంది. దీనికి అధిపతి జీవుడు.  రంగు నలుపు. వాహనం ఏనుగు.. అజ్ఞాచక్రం..ఇది రెండు కనుబొమ్మల మధ్య స్థానంలో ఉంటుంది. దీనికి అధిపతి ఈశ్వరుడు. రంగు తెలుపు. రెండు దళాలు గల పద్మాకారంలో ఉంటుంది. సహస్త్రారం..ఇది కపాలంపై భాగంలో ఉంటుంది. దీన్నే బ్రహ్మరథం అంటారు. దీనికి అధిపతి పరమేశ్వరుడు. సూక్ష్మన్నాడిపై ఈ చక్రం ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గణేషుడికి 21 పత్రాలతో పూజ... అవేంటో తెలుసా? ఈ వినాయకుడు దీవిస్తాడు(వీడియో)