మహిళలు ఇలానే జీవించాలని చాణక్యులు తెలిపారు. చాణక్య విధుల ప్రకారం.. మహిళలకు నిజాయితీగా వుండాలి. క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఇవి రెండూ మహిళలకు కీర్తిని, గౌరవాన్ని సంపాదించి పెడుతుంది. చాణక్య నీతిలో మహిళలు విద్యను అభ్యసించాలి.
విద్య మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొదింపజేస్తుంది. చాణక్య నీతి ప్రకారం.. నిజాయితీగా జీవించడం ద్వారా మహిళలకు కీర్తిప్రతిష్ఠలు చేకూరుతాయి. కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడాన్ని విస్మరించకూడదు. కుటుంబ ఐక్యత కోసం పాటుపడాలి. చెడు సహవాసాలు వుండకూడదు.
ఆడంబరానికి దూరం చేసుకోవాలి. ప్రతికూల ఆలోచనలు వుండకూడదు. మహిళలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఆత్మగౌరవం కోసం పాటుపడాలని చాణక్య నీతి చెప్తోంది.
డబ్బు ఆదా చేయడం ఎల్లప్పుడూ అవసరం. తొందరపడి తీసుకున్న ఏ నిర్ణయం అయినా జీవితాన్ని శాశ్వతంగా నాశనం చేస్తుంది. స్త్రీ పురుషుడి కంటే నాలుగు రెట్లు ధైర్యంగా ఉంటుంది. కాబట్టి క్రమశిక్షణతో మహిళలు జీవించాలని చాణక్య నీతి చెప్తోంది.