Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భాద్రపద పూర్ణిమ.. సత్యనారాయణ పూజ.. వస్త్రదానం, అన్నదానం..?

Sathya Narayana
, శనివారం, 10 సెప్టెంబరు 2022 (15:19 IST)
భాద్రపద పూర్ణిమకు ప్రాముఖ్యత వుంది. ఈ పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి పూజ చేయడం విశేషం. ముఖ్యంగా, ఈ పండుగ గుజరాత్‌లో చాలా ప్రసిద్ధి చెందింది. అక్కడ చాలా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. భక్తులు ప్రత్యేక చర్యలతో అంబా దేవికి ప్రార్థనలు చేస్తారు. అంబాజీ ఆలయంలో జాతర నిర్వహిస్తారు. 
 
భాద్రపద పూర్ణిమ విష్ణువు ఆరాధన విశేష ఫలితాలను ఇస్తుంది. భాద్రపద పూర్ణిమ తర్వాత మరుసటి రోజు, పితృ పక్ష శ్రాద్ధం ప్రారంభమవుతుంది. ఈ రోజు గృహ ప్రవేశ వేడుకను నిర్వహించడానికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున విష్ణుమూర్తి పూజతో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. 
 
సత్యనారాయణ పూజ సాధారణంగా భాద్రపద పూర్ణిమ నాడు చాలా గృహాలలో జరుగుతుంది. సత్యనారాయణ స్వామికి ఈ రోజున తేనె, పెరుగు, చక్కెర, నెయ్యి, పాలుతో కలిపి నైవేద్యంగా సమర్పించడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. పౌర్ణమి సాయంత్రం పూజ సత్యనారాయణ పూజ విశేష ఫలితాలను ప్రసాదిస్తుంది. 
 
సత్యనారాయణ స్వామికి భక్తులు స్వీట్లు, పండ్లు కూడా సమర్పిస్తారు. పూజ తర్వాత, చాలా పవిత్రమైనదిగా భావించే సత్యనారాయణ కథను చదవడం చాలా ముఖ్యం. భాద్రపద పూర్ణిమ రోజున దానధర్మాలు చేయడం మంచిది. వస్త్రదానం, అన్నదానం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నలుపు శునకాలకు రొట్టెలను తినిపిస్తే?