Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వామన జయంతి రోజున పెరుగు దానం చేస్తే?

vamana jayanthi
, మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (10:15 IST)
vamana jayanthi
ప్రతి సంవత్సరంలో ప్రతి ఏకాదశి కూడా చాలా విశేషమైనదే. అయితే భాద్రపద మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఈ ఏకాదశినే 'పరివర్తిని ఏకాదశి' అంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 06వ తేదీన ఈ ఏకాదశి తిథి వచ్చింది. ఇదే రోజున వామనుడి జయంతిగా పరిగణిస్తారు. 
 
ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి జారుకున్న శ్రీ మహా విష్ణువు, భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమ వైపు నుండి కుడివైపునకు తిరుగుతాడని పెద్దలు చెబుతారు. ఇలా ఆ విష్ణుమూర్తి ఒకవైపు నుండి మరొక వైపునకు పరివర్తనం చెందే ఏకాదశి కనుక, దీన్ని పరివర్తన ఏకాదశి అంటారు.  
 
ఈ ఏకాదశి రోజున ఉపవాస దీక్షను చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువుకు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేయాలి. అనంతరం తనకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి.  
 
ఇదే రోజున శ్రీ విష్ణుమూర్తి వామనావతారమెత్తి మహాబలి చక్రవర్తిని పాతాళంలోకి పంపుతాడు. పరివర్తన ఏకాదశి రోజున వామనుడిని పూజించడం వల్ల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని పూజించినంత ఫలం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. 
 
ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల మనకు తెలియకుండా చేసిన కొన్ని తప్పులకు పరిహారం లభిస్తుందట. మీరు చేసిన పాపాలు అన్ని తొలగిపోయి.. మీరు కోరిన కోరికలన్నీ ఫలిస్తాయట.
 
పూర్వ కాలంలో బలి చక్రవర్తి.. ఇంద్రుని చేతిలో ఘోరంగా ఓడిపోయి.. తన గురువైన శుక్రాచార్యుడిని శరణు కోరతాడు. కొంత కాలం తర్వాత తన గురువు అనుగ్రహంతో స్వర్గంపై ఆధిపత్యం చెలాయిస్తాడు. దీంతో ఇంద్రుడు అదితి దేవిని శరణు కోరగా.. ఇంద్రుని పరిస్థితిని చూసిన అదితి దేవి ఎంతో జాలి పడుతుంది. తను వయోవ్రతానుష్టానం చేసింది ఆ వ్రతం చివరిరోజున విష్ణుమూర్తి ప్రత్యక్షమై.. అదితికి బిడ్డై పుడతానని వరమిస్తాడు. 
 
అలా అదితి గర్భమున ఆ భగవంతుడు వామన రూపంలో జన్మించాడు. భగవంతుని పుత్రునిగా పొందిన అదితి సంతోషానికి అంతులేదు. అనంతరం బలి చక్రవర్తి అశ్వమేధ యజ్ణం చేస్తున్నాడని విన్న వామనుడు అక్కడికి వెళ్లాడు. బ్రాహ్మణ రూపంలో అక్కడికి చేరుకున్నాడు. ఆయన్ని పూజించిన బలి చక్రవర్తి వామనుని ఏదైనా కోరమని అడగగా.. ‘వామనుడు నాకు మూడు అడుగుల భూమి' కావాలి అని అడిగారు.
 
ఇదే సమయంలో శుక్రాచార్యుడు భగవంతుని లీలలను గ్రహించి.. ఈ దానం వద్దని బలి చక్రవర్తిని ఎంత బతిమాలినా.. తన గురువు మాట కూడా వినలేదు. అందుకు బలి ఒప్పుకున్నాడు. అంతే వామనుడు ఒక పాదమును భూమిపై.. మరో పాదమును స్వర్గ లోకంపై ఉంచాడు. ఇక మూడో పాదానికి బలి తనకు తానే సమర్పితుడయ్యాడు. ఇలా బలి చక్రవర్తిని దానమడిగిన వామనుడు దేవరులను ఆయన బరి నుంచి కాపాడారు. 
 
ఇకపోతే... పవిత్రమైన వామన జయంతి రోజున, బ్రాహ్మణులకు పెరుగు, అన్నం, వేరేదైనా ఆహారాన్ని దానం చేయడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం భక్తులు ఆ రోజు ఉపవాసం పాటిస్తారు. ఈ రోజు విష్ణు సహస్రనామం, అనేక ఇతర మంత్రాలు పఠిస్తారు. 
webdunia
vamana jayanthi
 
అలా విష్ణువు నామాన్ని 108 సార్లు పఠిస్తూ, భక్తులు దేవుడికి ధూపం, దీపాలు, పువ్వులు సమర్పిస్తారు. భక్తులు సాయంత్రం వామన కథను విని, దేవుడికి ప్రార్థనలు చేసి, భోగాన్ని సమర్పించి, భక్తులకు ప్రసాదాన్ని పంచిపెడతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భాద్రపద ఏకాదశి.. శ్రీహరిని పూజిస్తే.. శుభవార్తలు వింటారు..