Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏ ఆకులో భుజిస్తే ఏంటి ప్రయోజనం...?

అరటి ఆకులో భోజనం చేయడానికి పెట్టడానికి కారణం అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది, వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని అనేక రకాల పోషకాలు ఈ అరటి ఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి. పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపో

Advertiesment
Eating Food
, శనివారం, 15 ఏప్రియల్ 2017 (14:01 IST)
అరటి ఆకులో భోజనం చేయడానికి పెట్టడానికి కారణం అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది, వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని అనేక రకాల పోషకాలు ఈ అరటి ఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి. పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి. అందుకే ఇంటికి వచ్చిన అతిధుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశంతోనే అరిటాకులో భోజనం పెడతారు. 
 
అరటి ఆకులో, విస్తరి ఆకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది, ఆరోగ్యవంతులుగా ఉంటారు. తామరాకులో భోజనం చేయడం వలన ఐశ్వర్యం కలిగి సాక్షాత్ లక్ష్మీ దేవి కటాక్షం కలుగుతుంది. బాదం ఆకులో భోజనంచేయడంవలన కఠిన హృదయులవుతారు.
 
టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది. జమ్మి ఆకు విస్తరిలో భోజనం చేస్తే లోకాన్ని జయించే శక్తి సంపాదించవచ్చునని తపఃసంపన్నులు, జ్ఞానులు చెబుతారు. 
 
1) ధర్మ శాస్త్రం ప్రకారం .. మన ఇంట్లో మీకు పని వత్తిడుల వల్ల వస్తున్నాను ఆగమని చెప్పి అన్నీ వడ్డించిన విస్తరి పళ్లెం ముందు కూర్చోరాదు, మనం కూర్చున్న తరువాతే అన్నీ వడ్డించుకుని భుజించాలి. ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మన కోసం అన్నం ఎదురుచూడరాదు. అలా చేస్తే రానున్నకాలంలో దరిద్రం పట్టుకునే అవకాశం ఎక్కువ. 
 
2) ఏ దిక్కున కూర్చుని భోజనం చేసినా మంచిదే... ఐతే తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యం ఉంది, ఎందుంటే ఈ దిక్కువైపు తిరిగి భోజనం చేస్తే దీర్గాయుష్షు వస్తుంది. 
 
తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్య స్థానము, సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యమెక్కువ. పడమర ముఖంగా కూర్చుంటే ... బలం వస్తుంది. ఉత్తర ముఖంగా కూర్చుంటే సంపద వస్తుంది. దక్షిణ ముఖంగా కూర్చుంటే కీర్తి వస్తుంది.
 
ఎప్పటికీ ఆచరించవలసిన నియమాలు 
అన్నము తింటున్నప్పుడు అన్నమును మరియు ఆ అన్నము పెట్టేవారిని తిట్టటం చేయరాదు. ఏడుస్తూ తింటూ గిన్నె ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు, దెప్పి పొడువరాదు. ఎట్టిపరిస్థితిలోనైనా ఒడిలో కంచం, పళ్ళెము పెట్టుకుని అన్నం తినరాదు, ఇది చాలా దరిద్రము. 
 
భోజనసమయంలో నవ్వులాట, తగువులాట, తిట్టుకొనుట, గేలిచేయుట నష్టదాయకం. భోజనానంతరము ఎంగిలి ఆకులు, కంచాలు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం, అన్నదాతకు కూడా రాదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అద్దె ఇంట్లో హోమాలు చేయొచ్చా..? సొంతింటి కల నెరవేరాలంటే?