Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అద్దె ఇంట్లో హోమాలు చేయొచ్చా..? సొంతింటి కల నెరవేరాలంటే?

స్వగృహం కోసం ఎదురుచూస్తున్నారా? సొంతింటి నిర్మాణం కోసం లక్షలు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారా? అయినా మీరు చేసే ప్రయత్నాలు బెడసికొడుతున్నాయా? అయితే ఈ కథనం చదవండి. చాలామందికి సొంతిల్లు ఏర్పడే ప్రక్రియ సు

Advertiesment
అద్దె ఇంట్లో హోమాలు చేయొచ్చా..? సొంతింటి కల నెరవేరాలంటే?
, బుధవారం, 12 ఏప్రియల్ 2017 (14:07 IST)
స్వగృహం కోసం ఎదురుచూస్తున్నారా? సొంతింటి నిర్మాణం కోసం లక్షలు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారా? అయినా మీరు చేసే ప్రయత్నాలు బెడసికొడుతున్నాయా? అయితే ఈ కథనం చదవండి. చాలామందికి సొంతిల్లు ఏర్పడే ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది. అనుకూల పరిస్థితులు.. ముహూర్తఫలం.. సంకల్పం వంటివి అనుకూలిస్తే.. సొంతింటి కల నెరవేరుతుంది. 
 
కానీ కొందరికి మాత్రం సొంతిల్లు నిర్మించాలి లేదా కొనాలనే ప్రక్రియ కలగానే మిగిలిపోతుంది. అలాంటివారు గృహసిద్ధి కోసం ఏం చేయాలంటే? ముందుగా ప్రతిబంధకాలను తొలగించుకోవాలి. జాతక ప్రకారం గురుగ్రహ స్థితిగతులను పరిశీలించాలి. జాతకంలో చతుర్థాభావం (నాలుగోస్థానం)లో ఎలాంటి దోషాలు లేకుండా చూసుకోవాలి. గృహసిద్ధికి కారకుడైన గురుభగవానుడి అనుగ్రహం పొందాలి. ఇంకా చతుర్థాభావం దోషాలు లేకుండే విధంగా చూసుకోవాలి. ఈ రెండు అనుకూలిస్తే గృహసిద్ధి సులభమవుతుంది. ఈ రెండింటి అనుగ్రహం లేకపోతే.. ఇంటి కల నెరవేరదు. 
 
ఈ ప్రతిబంధకాన్ని తొలగించుకోవాలంటే ముందుగా దైవానుగ్రహం పొందాలి. గృహసిద్ధి సంకల్పం కోసం "ఓం క్షేత్రజ్ఞాయ నమః" అనే మంత్రాన్ని 108 సార్లు అసుర సంధ్యాకాలంలో పఠించాలి. అంటే సాయంకాలం పఠించాలి. ఆవునేతితో దీపమెలిగించి.. ఇష్టదైవం ముందు వుంచి 108 సార్లు పై మంత్రాన్ని పఠించాలి. ఇలా 48 రోజులు చేస్తే సొంతింటి కోరిక నెరవేరుతుందని పండితులు చెప్తున్నారు. 
 
ఇంకా స్వగృహం అనేది సామాన్యమైనది కాదు. విశేషమైనది. ఏదైనా పుణ్యకార్యం చేయాలంటే.. ఆ పుణ్యకార్య ఫలితం పొందాలంటే స్వగృహంలోనే చేయాలి. లేకపోతే ఇంటి యజమానికి కొంత పుణ్యఫలం వెళ్ళిపోతుంది. అదే ఇంటి యజమాని మనమే అయితే మనం చేసిన పుణ్యకార్య ఫలితం పరిపూర్ణంగా మనకే లభిస్తుంది. అందుకే స్వగృహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ స్వగృహంలోనే పెద్దతనం పూర్తి చేసుకోవాలి. 
 
దైవకార్యక్రమాలు, యజ్ఞాలు, హోమాలు అద్దె ఇంటిలో చేస్తే అది యజమానికి చేరుతుంది. అందుకే సొంతింటిలో సత్కార్యాలు చేసేందుకు ప్రయత్నించాలి. కాబట్టి ప్రతిబంధకాలను తొలగించుకుని.. ఆపై గృహసిద్ధి కోసం ప్రయత్నాలు చేయాలని.. తద్వారా సొంతింటి కల నెరవేరుతుందని పండితులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉదయం లేవగానే కరదర్శనం చేయాలి.. ఎందుకు?