Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉదయం లేవగానే కరదర్శనం చేయాలి.. ఎందుకు?

చేయి పైభాగాన లక్ష్మీ, మధ్యభాగమున సరస్వతి, చివరిభాగమున గౌరీదేవి వున్నందున ప్రాతః కాలమున ఈ శ్లోకం చదివి మన రెండు చేతులను కళ్ళకు అద్దుకోవాలి. లేదంటే.. మూడుసార్లు శ్రీహరి, శ్రీహరి శ్రీహరి అని తలస్తూ కరదర్

ఉదయం లేవగానే కరదర్శనం చేయాలి.. ఎందుకు?
, బుధవారం, 12 ఏప్రియల్ 2017 (12:50 IST)
ఉదయం లేవగానే కరదర్శనం చేయాలి. కరదర్శనం చేసుకునేటప్పుడు.. 
 
"కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి
కరమూలే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం" - చేయి పైభాగాన లక్ష్మీ, మధ్యభాగమున సరస్వతి, చివరిభాగమున గౌరీదేవి వున్నందున ప్రాతః కాలమున ఈ శ్లోకం చదివి మన రెండు చేతులను కళ్ళకు అద్దుకోవాలి. లేదంటే.. మూడుసార్లు శ్రీహరి, శ్రీహరి శ్రీహరి అని తలస్తూ కరదర్శనం చేసుకోవాలని పండితులు చెప్తున్నారు. జ్ఞానం, ఐశ్వర్యం, ఆధ్మాతిక భావన లభించాలంటే.. ఉదయం లేవగానే కరదర్శనం చేయాలి. 
 
మన చేతివేళ్ళ చివరిన లక్ష్మీ దేవి, చేతి మధ్యలో సరస్వతీ, ముంజేతి దగ్గర సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తి కోలువై యున్నారు. పై శ్లోకం చెప్పి రెండు చేతులతో ముఖాన్ని నిదానంగా తుడుస్తూ కళ్ళు తెరిచి చేతులను చూడాలి. ఇలా చేస్తే అంతా మంచే జరుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. 
 
అలాగే శుచిగా స్నానమాచరించి మహిళలు నుదుటన కుంకుమ పెట్టుకోవాలి. కుంకుమను స్త్రీ, పురుషులు ధరించడం మన సనాతన ఆచారం. ఇది తప్పనిసరి. ఎందుకంటే - రెండు కనుబొమలకు మద్యభాగమైన నుదుటిస్థానం 'ఇడ' 'పింగళ' 'సుషుమ్న' అనే ప్రధాన నాడుల సంగమస్థానం. కుంకుమ ధరించడం పవిత్రతకు, అస్తికత్వానికి, ధార్మికత్వానికి పురుషులకు సంకేతమైతే, స్త్రీలకు ఐదవతనానికి, సౌభాగ్యానికి, స్థిరబుద్ధికి సంకేతంగా చెప్తారు. 
 
కుంకుమ మనిషిలోని మనోశక్తిని, త్యాగతత్వాన్ని, నిర్భయత్వాన్ని, సహృదయతను పెంపొందిస్తుంది. మనం బొట్టు పెట్టుకునే స్థానానికి త్రివేణి సంగమమని, అమృతస్థానమని పేరు. ధ్యానానికి ఇది ముఖ్యస్థానం. ఈచోట కుంకుమధారణ వలన పుష్టి, భక్తి, ఐశ్వర్యం మొదలైనవి కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లంకలో హనుమంతుడు ఎడమకాలు ఎందుకు పెట్టాడంటే...?