Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బతుకమ్మ పండుగ విశిష్టత.. పసుపు రంగు పూలతో పేర్చి...

Advertiesment
బతుకమ్మ పండుగ విశిష్టత.. పసుపు రంగు పూలతో పేర్చి...

సెల్వి

, సోమవారం, 30 సెప్టెంబరు 2024 (16:42 IST)
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ, తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. 
 
శివుడు లేని పార్వతి గురించి పాటలగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు తెలంగాణ వాసులు. బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. 
 
పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది.
 
9 రోజులపాటు ప్రతిరోజూ ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు, యువతులు పాల్గొంటారు. చివరిరోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈ రోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు.
 
బతుకమ్మకు సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక పురాణం ప్రకారం గౌరీ దేవి మహిషాసురుడు అనే రాక్షసుడిని చంపింది. తరువాత ఆమె అలసటతో 'ఆశ్వయుజ పాడ్యమి' నాడు నిద్రపోయింది. భక్తులు ఆమెను మేల్కొలపమని ప్రార్థించారు. ఈ నేపథ్యంలో ఆమె దశమి నాడు మేల్కొంది.
 
మరో కథనాన్ని చూస్తే కాకతీయ చక్రవర్తుల కాలం అంటే సుమారు 12వ శతాబ్దం నుంచి ఈ పండుగ ఉన్నట్లుగా ఆధారాలు ఉన్నాయి. ఆ కాలంలో పువ్వులను బతుకుగా భావించి పూజించేవారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

30-09-2024 సోమవారం దినఫలితాలు : నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం...