చాలామంది కష్టపడి పనిచేస్తే విజయం వస్తుందంటారు. కానీ, కష్టపడడం మాత్రమే కాదు. తెలివిగా ఆలోచిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అందుకే హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయాలంటారు మానసిక నిపుణులు. దీని వల్ల మీకు రెస్ట్ కూడా దొరకమే కాకుండా పనిభారాన్ని తగ్గిస్తుంది.
నిజానికీ మనం హ్యాపీగా ఉండాలంటే అది మనమే సృష్టించుకోవాలి. మరొకరిపై ఆధారపడి ఏపని చేయకూడదు. అలాగే ఆశించడం కూడదు. జీవితంలో ఏది శాశ్వతం కాదు.
అందుకే ఏ వస్తువులపైనా అంతగా ఆశ పెట్టుకోకూడదు. ఎప్పుడైనా ఏదైనా జరుగొచ్చు. జయాపజయాలను సరితూకం వేసుకోవాలి. అప్పుడే మనం హ్యాపీగా వుండగలుగుతాం.