ఆమె కొట్టిన సెంటు వాసనకు వివశుడనయ్యా... దానికి అంత పవరుందా?

మంగళవారం, 20 నవంబరు 2018 (18:16 IST)
నా గాళ్ ఫ్రెండ్ ఇటీవల ఓ మంచి అత్తరును చల్లుకుని వచ్చింది. ఆ సువాసనకు నేను వివశుడనయ్యా. శృంగారం కావాలని ఆమెను చాలా ఇబ్బంది పెట్టాను. నన్ను విదిలించి... ఇక ఎప్పుడూ ఆ సెంటును కొట్టుకు రానని చెప్పింది. సెంటు సువాసనకు కోర్కెలను పెంపొందించే శక్తి ఉంటుందా...?
 
ఇక్కడ ఓ విషయాన్ని మీరు గమనించాలి. ఏ వాసన ఎవరు ఇష్టపడతారనేది వ్యక్తివ్యక్తికీ మారుతూ ఉంటుంది. కొంతమందిలో పూల వాసనలు శృంగార కోర్కెలను పెంచుతాయి. ఈ పూలలో కూడా మల్లెలు కొంతమందికి ఇష్టమయితే మరికొందరిలో జాజులు, ఇంకొందరిలో సంపెంగల వాసనలు ఇష్టంగా ఉంటాయి. వాటి ద్వారా ఉద్దీపనలు వారిలో కలుగుతాయి. కనుక కొన్ని రకాల అత్తరులకు ఇలా కోర్కెలను రగిల్చే గుణం ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఉసిరికాయ ఊరగాయ రాత్రిపూట తినకూడదా?