Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా భార్యను అక్కడ తాకుతున్నాడు... అతడు సోదరుడు వరస అంటోందామె...

Advertiesment
life style
, మంగళవారం, 17 మే 2016 (21:55 IST)
ఇటీవలే పెళ్లయింది. నా భార్య ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ ఓ యువకుడు నా భార్యతో చాలా చనువుగా ఉండటం చూశాను. అతడు ఆమెతో మాట్లాడుతూనే అప్పుడప్పుడు తన చేతిని ఆమె వక్షోజాలకు తాకిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమెతో నేరుగా చెప్పలేక చూచాయగా అన్నాను. అతడు తనకు సోదరుడు వరస అవుతాడనీ, అలాంటి ఉద్దేశ్యంతో చూడొద్దని అంటోంది. కానీ అతడి చేష్టలు నాకు నచ్చడం లేదు. ఏం చేయాలి...?
 
ఈ సమస్య సున్నితమయినదే కాకుండా ఇబ్బందికరమయినదే. టీనేజ్ దాటి అప్పుడే పెళ్లాడిన అమ్మాయిల్లో కాస్తంత అమాయకత్వం ఉంటుంది. చిన్నతనం నుంచి తన కుటుంబ సభ్యుల పిల్లల మధ్య చనువుగా పెరగటం మూలంగా సోదరులతో చనువు ఉంటుంది. పెళ్లీడు వయసు వచ్చినా కొందరు అబ్బాయిలు, అమ్మాయిల పట్ల అలాగే ఉంటుంటారు. అంతమాత్రాన వారిలో తప్పు భావన ఉన్నదని అనుకోకూడదు. అయితే ఇది కొత్తగా పెళ్లయిన భర్త తనకుతాను సముదాయించుకున్నప్పటికీ పొరుగువారు సమస్యను రాజేస్తుంటారు. 
 
కనుక విషయాన్ని భార్యతో చనువుగా ఉండేవారి దృష్టికి తీసుకెళ్లి సున్నితంగానే ఆమె మనసు నొచ్చుకోకుండా, అదేవిధంగా ఆమె సోదరుడికి ఇబ్బంది కలుగకుండా పరిష్కరించుకోవాలి. అంతేకాని కొత్తగా పెళ్లయిన భార్యను వెంటనే ఆంక్షలు విధిస్తూ భయపెట్టకూడదు. మెల్లగా చెబితే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాఫీ ఎన్నిసార్లు తాగుతున్నారు...?