మునుపటి అలవాట్లు మార్చుకుని కొత్త అలవాట్లు చేసుకోవడం. రాత్రుళ్లు ఇంటికి ఆలస్యంగా రావడం. బిజినెస్ ట్రిప్‌లకు ఎక్కువగా వెళ్లడం. సెలవులను మీతో గడపకపోవడం లేదా ఫ్యామిలీలో జరిగే ముఖ్యమైన ఈవెంట్‌లకు రాకపోవడం. ఎక్కువగా ఓవర్‌టైమ్ చేయడం. ఖర్చులు ఎక్కువ కావడం. సోషల్ మీడియాలో రహస్యంగా అకౌంట్స్ ఉండటం.
క్రెడిట్ కార్డ్ బిల్లులు దాచడం. జిమ్‌లో చేరడం. కొత్త నంబర్‌ల నుండి మిస్డ్ కాల్‌లు, మెసేజ్‌లు రావడం. అబద్ధాలు చెప్పడం. వెంటనే కోపం రావడం. మీకు తెలీకుండా బహుమతులు దాచడం లేదా కొనడం. సడెన్ సర్‌ప్రైజ్‌లను ఇష్టపడకపోవడం వంటివి. ఈ లక్షణాలలో ఏదో ఒకటో రెండో ఉంటే ఫర్వాలేదు గానీ నాలుగైదు కంటే ఎక్కువగా ఉంటే మీ రిలేషన్‌షిప్ ప్రమాదంలో ఉన్నట్లే అని చెప్తున్నారు నిపుణులు.