Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆఫీసుల్లో రాటు దేలాలంటే..? శత్రువుల్ని పక్కకు చేర్చకండి.. రాజకీయాలకు చెక్ పెట్టండి!

రాజకీయాలు జరగని చోటంటూ లేదు. అందుకు ఆఫీసులు అతీతం కాదు. కార్యాలయాల్లో పనిచేసే తోటి వ్యక్తుల్లో మంచీచెడూ ఉంటుంది. మిత్రత్వం శత్రుత్వం కూడా ఏర్పడుతుంది. బలం-బలహీనతలూ ఉంటాయి. అయితే ఆఫీసుల్లో రాటు దేలాలంట

ఆఫీసుల్లో రాటు దేలాలంటే..? శత్రువుల్ని పక్కకు చేర్చకండి.. రాజకీయాలకు చెక్ పెట్టండి!
, మంగళవారం, 19 జులై 2016 (17:05 IST)
రాజకీయాలు జరగని చోటంటూ లేదు. అందుకు ఆఫీసులు అతీతం కాదు. కార్యాలయాల్లో పనిచేసే తోటి వ్యక్తుల్లో మంచీచెడూ ఉంటుంది. మిత్రత్వం శత్రుత్వం కూడా ఏర్పడుతుంది. బలం-బలహీనతలూ ఉంటాయి. అయితే ఆఫీసుల్లో రాటు దేలాలంటే.. ముందు మనలో ఆత్మవిశ్వాసంతో కూడిన బలం ఉండాలి. ఎక్కడ ఉద్యోగం చేసినా రాజకీయాలు ఉండక తప్పవు. కుట్రలు, కుతంత్రాలు ఎక్కువే ఉంటాయి. 
 
ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు ఒక్కొక్కరు ఒక్కో రకం. అందరూ ఒకే కోవలోకి రానేరారు. కొందరైతే అసలు ఇలాంటి రాజకీయాలు పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతుంటారు. అయినా వారిని రాజకీయాలు ఏమాత్రం వదిలిపెట్టవు. ఎలాంటి వారైనా రాజకీయాల బారిన పడాల్సి వస్తుంటుంది. అలా మీరు కూడా రాజకీయాల బారిన పడితే ఏం చేయాలో తెలుసా?
 
* పనిపై బాగా పట్టు సాధించాలి 
* అనుకున్న లక్ష్యాన్ని సమయంలోపు ముగించాలి. 
* ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండాలి
* బద్ధకాన్ని పక్కనబెట్టాలి
* రాజకీయాలకు దూరంగా ఉండాలి.
* ఒకవేళ ఇరుక్కుపోతే మాత్రం ఎదుటివారి గోలేంటో తెలుసుకుని మెలగాలి
* ఎవరి మంచి ఎవరు చెడు అని తెలుసుకోగలగాలి. 
 
* శత్రువులు మనకు పట్టుబడినప్పుడు వారు స్నేహానికి సుముఖత చూపినా.. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మడం చేయకూడదు. 
* అలాగే ఎలాంటి సందర్భంలోనైనా మంచి ప్రవర్తన, నడవడికతో మెలిగినప్పుడే మనకు విలువ వుంటుందని గమనించాలి. అలాకాకుండా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే మాత్రం ఇతరుల దృష్టిలో మన విలువను కోల్పోతాం.  
 
* ఇక మూర్ఖులుగా ఉన్న వారికి ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు. మూర్ఖులకు సలహా ఇస్తే అది బూడిదలో పోసిన పన్నీరవుతుంది. 
* స్నేహితులను ఎంపిక చేసుకోవడంలో ఆలోచించండి. వారి ప్రవర్తన, నైజం ఏమిటో తెలుసుకుని స్నేహం చేయండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ‌ర్షాకాలంలో చ‌ర్మ సౌంద‌ర్యానికి తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌లు....