Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వ‌ర్షాకాలంలో చ‌ర్మ సౌంద‌ర్యానికి తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌లు....

చర్మం మీద వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌కు తగినవిధంగా తలెత్తే ఇబ్బందులను తట్టుకోవడానికి ఒక సమగ్రమైన ఆల్‌రౌండ్ స్కిన్‌కేర్ రొటీన్ అవసరం మండే ఎండల నుండి వర్షాలు ఉపశమనాన్ని ఇస్తాయి. అదే సమయంలో చర్మ సంరక్షణ అనేది కూడా ఈ సీజన్‌లో అంతే

Advertiesment
rainy season
, మంగళవారం, 19 జులై 2016 (16:55 IST)
చర్మం మీద వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌కు తగినవిధంగా తలెత్తే ఇబ్బందులను తట్టుకోవడానికి ఒక సమగ్రమైన ఆల్‌రౌండ్ స్కిన్‌కేర్ రొటీన్ అవసరం మండే ఎండల నుండి వర్షాలు ఉపశమనాన్ని ఇస్తాయి. అదే సమయంలో చర్మ సంరక్షణ అనేది కూడా ఈ సీజన్‌లో అంతే ప్రధానం. చర్మంలోని మృతకణాలను తొలగించి చర్మం కాంతివంతంగా, మృదువుగా మారేలా చేస్తాయి.
 
* మాస్క్ వేసుకునేటప్పుడు, పొడిచర్మం వారు తేనె, రోజ్‌ వాటర్‌, పాలపొడి కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాలు ఉంచి కడిగేయాలి. ఈ చర్మం గలవారు గుడ్డుసొనను కూడా ముఖానికి అప్లై చేయవచ్చు. ఇలా చేస్తే చర్మం పొడిగా ఉండదు. ఇంకా అరటిపండు, యాపిల్‌, బొప్పాయి వంటి పండ్ల గుజ్జును ముఖానికి పట్టించి 20 నిమిషాలు ఆరనిచ్చి నీటితో కడిగినా ఫలితం ఉంటుంది. 
 
* పొడిచర్మం కలవారు చర్మాన్ని శుభ్రపరచుకునేటప్పుడు, పాలల్లో వెజిటబుల్ ఆయిల్‌‌ను వేసి బాగా కలిపి కాటన్‌‌తో చర్మంపై రుద్దుకోవాలి. మృదువైన చర్మం కలిగిన వారైతే, ఆరెంజ్ జ్యూస్‌‌లో తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత చల్లటి నీటితో కడగాలి. పెరుగు, పసుపు, తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖంపై మర్దనా చేసి, పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. 
 
* వ‌ర్షాకాలంలో మీ చర్మం మరీ పొడిబారినట్లు కనబడుతుంటే, మంచి నాణ్యమైన మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ తో పాటు, రోజ్ వాటర్, గ్లిజరిన్ లేదా బాదం ఆయిల్ మిక్స్ చేసి నిద్రించే ముందు అప్లై చేయాలి.
 
* సన్‌‌స్క్రీన్ లోషన్ త‌ప్పనిసరిగా అప్లై చేయాలి. వర్షకాలంలో ప్రతి రోజూ డెడ్ స్కిన్‌ను తొలగించాలి. అందుకు స్కిన్ స్ర్కబ్‌ను ఉపయోగించి డెడ్ స్కిన్ సెల్స్‌ను నివారించి మీ చర్మం కాంతివంతంగా మరియు మెరుస్తుండేలా చేసుకోవాలి.     
* మసాజ్ ఆయిల్, గంధం పొడి, రోజ్ వాటర్, తేనె కలిపిన మిశ్రమంతో బాడీ మసాజ్‌ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే, చర్మం పొడిబారకుండా, మృదువుగా ఉంటుంది. కొంతమందికి చర్మం పగిలినట్టుగా ఉంటుంది. ఇలాంటివారు సబ్బుతో స్నానం చేయకుండా, సున్నిపిండి ఉపయోగిస్తే మంచిది. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత వెనిగర్‌ కలిపిన నీళ్ళను శరీరంపై పోసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. సోపు కాకుండా ఫేస్‌వాష్ లిక్విడ్‌తో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన. జిడ్డు, దుమ్ము, ధూళిని నిర్మూలిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆయిల్ పుల్లింగ్... ఆరోగ్య రహస్యాలు...