Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆయిల్ పుల్లింగ్... ఆరోగ్య రహస్యాలు...

కేవలం ఒక స్పూను నూనె వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటే ఆశ్చర్యంగానే వుంటుంది. ఎలాంటి చికిత్స, ఖర్చు లేకుండా దినచర్యలో ఒక భాగంగా ఆయిల్‌ పుల్లింగ్‌ చేశామంటే రోగాలు ఆమడదూరంలో వుంటాయి. పరిశుభ్రమైన, శుద్ధి చేయబడిన సన్‌‌ప్లవర్‌ ఆయిల్‌, వేరుశనగ, కొబ్బరి నూనె

ఆయిల్ పుల్లింగ్... ఆరోగ్య రహస్యాలు...
, మంగళవారం, 19 జులై 2016 (14:52 IST)
కేవలం ఒక స్పూను నూనె వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటే ఆశ్చర్యంగానే వుంటుంది. ఎలాంటి చికిత్స, ఖర్చు లేకుండా దినచర్యలో ఒక భాగంగా ఆయిల్‌ పుల్లింగ్‌ చేశామంటే రోగాలు ఆమడదూరంలో వుంటాయి. పరిశుభ్రమైన, శుద్ధి చేయబడిన సన్‌‌ప్లవర్‌ ఆయిల్‌, వేరుశనగ, కొబ్బరి నూనె, నువ్వుల నూనెలలో ఏదో ఒకటి ఒక టేబుల్‌ స్పూన్‌ పరిమాణంలో నోటిలో వేసుకొని, నోటి భాగమంతా, పళ్ళ సందుల మధ్య తిరిగేలా పదిహేను నుండి ఇరవై నిమిషాల దాకా పుక్కిలించాలి. ఆ విధంగా చేసిన తర్వాత నోటిలోని నూనె ద్రవంలా తయారవుతుంది. దాన్ని బయటకు ఉమ్మివేసి పళ్ళను, నోటిని శుభ్రపరచుకోవాలి.
 
నిద్రలేవగా మొదటి చేయవలసిన పని ఆయిల్ పుల్లింగ్. రోజులో ఖాళీ కడుపు వుండే సమయాల్లో పైవిధంగా చేయాలి. మిగిలిన టైమ్‌లో కంటే ఉదయమే చాలా మంచిది. ఉదయాన్నే నిద్ర లేవగానే బ్రెష్ చేసుకొని, నీటితో నోటిని బాగా శుభ్రం చేసి ఆ తర్వాత ఈ విధంగా మొదలు పెడితే మంచిది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె తీసుకొని నోట్లో నింపుకోవాలి. నోటి భాగమంతా, పళ్ళ సందుల మధ్య తిరిగేలా పదిహేను నుండి ఇరవై నిమిషాల దాకా పుక్కిలించాలి. ఆ విధంగా చేసిన తర్వాత నోటిలోని నూనె ద్రవంలా తయారవుతుంది. దాన్ని బయటకు ఉమ్మివేసి పళ్ళను,నోటిని శుభ్రపరచుకోవాలి.
 
పూర్తి శరీరంలో ఎక్కువగా బ్యాక్టీరియా ఉండేది నోట్లో మాత్రమే. దీని వలన అనేక ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఆయిల్ పుల్లింగ్ వలన నోట్లో ఉండే బ్యాక్టీరియా బయటకు పంపించబడి, దంతక్షయం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. వీటితో పాటుగా చెడుశ్వాస నుండి ఉపశమనం పొందటమే కాకుండా, దంతాలు మెరుస్తాయి. ఆయిల్ పుల్లింగ్ వల్ల చర్మానికి మంచిదని చాలా మందికి తెలియదు. 
 
ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల చర్మం హెల్తీగా మారడంతోపాటు, గ్లోయింగ్‌గా మారుతుంది. నోటి ద్వారా శరీరం లోపలికి వెళ్లే బ్యాక్టీరియాను నోట్లోనే నాశనం చేసే సత్తా ఆయిల్ పుల్లింగ్ కి ఉంది. దీనివల్ల రక్తం శుద్ధి అయి, మొటిమలు, ఇతర చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. ఆయిల్ పుల్లింగ్ వల్ల ప్రమాదకర కారకాలు, విష పదార్థాలు శరీరం నుండి భయటకు పంపించబడి, శక్తి స్థాయిలు పెరుగుతాయి. నోటి ఆరోగ్యం, గుండె ఆరోగ్యంతో ముడిపడి ఉంది. 
 
'పెరియోడెంటల్' (చిగుళ్ళ వ్యాధి) వ్యాధులు, 'ఎండోకార్డైటిస్' వంటి గుండె పరిస్థితులలో అనుసందించబడి ఉంటాయి. కావున, మీ నోటిని మరియు శ్వాస వ్యవస్థను పరిశుభ్రంగా ఉంచుకోవటం వలన గుండె వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ఆయిల్ పుల్లింగ్ శరీర వ్యవస్థలలో ఉండే బ్యాక్టీరియాలను తొలగించి లేదా వాటి ఏర్పాటును వినాశనం చెందించి, పరోక్షంగా కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 
 
మన శరీర వ్యవస్థలలో విషపూరిత పదార్థాలతో నిండి ఉండటం వలన, హార్మోన్లలో అసమతుల్యతలకు లోనవుతాయి. ఈ హానికర విషపూరిత పదార్థాలు శరీరం నుండి భయటకు పంపించిన తరువత, హార్మోన్లు తమ విధులను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహిస్తాయి. వీటిని భయటకు పంపుటానికి ఆయిల్ పుల్లింగ్ ఉపయోగపడుతుంది. శరీరంలో టాక్సిన్స్ పెరిగితే తలనొప్పి వస్తుంది. క్రమేణా అది మైగ్రేన్‌ నొప్పికి దారి తీస్తుంది. అటువంటి వారు ఆయిల్‌ పుల్లింగ్‌ చేయడం వల్ల టాక్సిన్స్ తగ్గి తలనొప్పి తగ్గుముఖం పడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొవ్వు క‌రిగించే.. ఆహార ప‌దార్ధాలు ఇవే...