Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

‘‘మన కోసం ఇద్దరమ్మాయిలను చూసి పెట్టాను’’...

దురలవాట్లను వదలాలని దృఢంగా అనుకునేవారు.. కొత్తగా వేరే అలవాట్లకు బానిసలైపోతారు. పొగత్రాగడం, మద్యం సేవించడం మరచిపోవాలని ప్రయత్నించకండి. పొగ తాగినా, మద్యం సేవించినా మీ శరీరంలో ఎన్నెన్ని మార్పులొస్తాయో ఆ క్షణంలో తీవ్రంగా తలచుకోండి. దురలవాట్లు వాటంతట అవే

‘‘మన కోసం ఇద్దరమ్మాయిలను చూసి పెట్టాను’’...
, శుక్రవారం, 23 జూన్ 2017 (15:24 IST)
దురలవాట్లను వదలాలని దృఢంగా అనుకునేవారు.. కొత్తగా వేరే అలవాట్లకు బానిసలైపోతారు. పొగత్రాగడం, మద్యం సేవించడం మరచిపోవాలని ప్రయత్నించకండి. పొగ తాగినా, మద్యం సేవించినా మీ శరీరంలో ఎన్నెన్ని మార్పులొస్తాయో ఆ క్షణంలో తీవ్రంగా తలచుకోండి. దురలవాట్లు వాటంతట అవే మిమ్మల్ని వదిలిపోవడం ఖాయం.
 
ఆనందంగా ఉండడానికి దేన్నీ వెతుకుతూ పోవద్దు. అప్పుడు దేన్నైనా తోడు చేసుకోవాలనిపిస్తుంది. సుఖం కోసం దేని వెంట పోతారో, దానివలన ఏమి జరుగుతుందో గమనించడం లేదు. సంతోషాన్ని మనం బయటి వస్తువులతో సృష్టించలేం. వాటి ద్వారా లభించేది సంతోషం కాదు, క్షణిక సుఖం. ఒక స్థితిలో వాటికి బానిసలవుతున్నారు. అన్నిటికీ బానిస అవడం తెలివి అనిపించుకోదు. ‘సంతోషంగా ఉండాలంటే బాధలు మర్చిపోవాలి. బాధలు మర్చిపోవడానికే  తాగుతున్నాను’’ అని చెప్పే వ్యక్తులు ఒకటి మర్చిపోతున్నారు. మత్తు దిగిన వెంటనే, ఆ బాధ ద్విగుణీకృతం కాదా?
 
ఒకసారి ఇద్దరు యువకులు ఒక బార్‍లో తాగుతూ కూర్చున్నారు.ఒకడు, ‘‘మన కోసం ఇద్దరమ్మాయిలను చూసి పెట్టాను’’. ఎదుటివాడు ‘‘అందంగా ఉంటారా?’’ అన్నాడు. ‘‘రెండు పెగ్గులు వీస్కీ లోపలికి పోతే, ఎవరైనా అందంగా కనిపిస్తారు’’ అన్నాడు మొదటివాడు. ఇద్దరూ తూలుతూ వెళ్లి ఒక ఇంటి తలుపు తట్టారు. తలుపు తెరచిన అమ్మాయిని చూపించి మొదటివాడడిగాడు, ‘‘ఎలా ఉంది? అందంగా కనిపిస్తోందా?’’ రెండవ తాగుబోతు గట్టిగా నిట్టూర్పు విడుస్తూ. ‘‘దీనికి పెగ్గులు సరిపోవు. పీపాలు తాగాలి’’ అన్నాడు.
 
మీ బాధలూ అంతే! పెగ్గులు తాగితే, పీపాలు కావాలంటాయి. మీరు మూర్ఖంగా సుఖం వెదుక్కుంటూ పోవడానికి, సంతోషంగా ఉండడానికి మధ్య ఎంతో దూరం ఉంది. సంతోషం పొందడానికి మత్తుపదార్థాలను ఆశ్రయించడం అనేది, సముద్రపు లోతును అడుగు బద్దతో కొలవడానికి ప్రయత్నిస్తున్నట్లే. ఒకటి అర్థం చేసుకోండి. పొగ పీల్చడం వలన, తాగడం వలన మీకు సంతోషం కలగదు. దాంట్లో మీరు చూపే ఆసక్తే ఆ సంతోషాన్ని తీసుకువస్తుంది. తప్పు దానిది కాదు. ఇష్టమైనది పూర్తి ఆసక్తితో చెయ్యండి. దాంట్లో దొరికేదే నిజమైన ఆనందం, సంతోషం. ఆలోచించండి. మత్తుతో బాధ పోతుందా? లేదు. అది అక్కడే గట్టిగా తిష్ట వేసుకుని కూర్చుంది. మీరు దానివైపు చూడకుండా, మొహం తిప్పుకుని కూర్చున్నారు, అంతే.
 
బాధలు మర్చిపోవడానికి, మత్తు పదార్థాలను ఆశ్రయించడం అంటే సింహం నుంచి తప్పించుకోవడానికి, దాని నీడలోనే దాక్కున్నట్లు. బాధలు మర్చిపోవడానికి, మత్తు పదార్థాలను ఆశ్రయించడం అంటే సింహం నుంచి తప్పించుకోవడానికి, దాని నీడలోనే దాక్కున్నట్లు. సమస్యలనుండి తప్పించుకోవాలనుకోకుండా, వాటినెదిరించి పరిష్కరించడమే తెలివైన పని. సంతోషం మీ జీవితంలోంచి వెళ్ళిపోవచ్చు అన్న భావన కత్తిలా మెడమీద వేలాడుతూ ఉంటుంది. తనకు తానే అది దూరం కావచ్చు. లేక డాక్టర్ల వలన, ప్రభుత్వం వలన, సంఘం వలన అది బలవంతంగా వేరు కావచ్చు. దేనికైనా బానిస అయితే; అది దక్కనపుడు, అది దూరమైందనే బాధ మీ సుఖానికి అడ్డు తగులుతుంది.
 
క్లబ్‍లో కృంగిన శరీరంతో ఒకడు దగ్గుతూ కూర్చున్నాడు. అతని దగ్గరికి ఓ యువకుడొచ్చి. ‘‘మీరు రోజూ నలభై  సిగరెట్లు పైగా పీల్చేస్తున్నారు. అరడజను పెగ్గుల మందు తాగుతున్నారు. వీటన్నిటితో ఇంతవరకు బతకగలిగారు. అస్తమానమూ నాకు బోధ చేసే మా నాన్నగారికి మిమ్మల్ని పరిచయం చేయాలని ఉంది. వస్తారా తాతగారూ?’’ అని అడిగాడు. ‘‘తాతనా! నా వయసు ఇరవైరెండేళ్ళే, బ్రదర్‍!’’ అని సమాధానం వచ్చింది. ఇలా ఇరవైఏళ్ళకే మీ శరీరానికి అరవైఏళ్ళ వృద్ధాప్యం రావాలా? ఆలోచించండి. ఇలా సుఖమని వెదుక్కుంటూ పోవడమే, తర్వాత మీ బాధలకు ముఖ్య కారణం అవుతుంది.
 
మీరు సుఖం కోసం తాగాలనుకుంటే, మిమ్మల్ని మొద్దుబార్చకుండానే అపరిమిత ఆనందాన్ని ఇచ్చేదాన్ని ఆస్వాదించండి. ఎప్పుడూ ప్రజ్ఞతో ఉంటూనే పూర్తి మత్తులో ఉండవచ్చు. ఆ అమృతం యోగానందంలో వుంది. ధ్యానం చేసి మనసును అదుపులో వుంచుకోండి.
 
-సద్గురు జగ్గీ వాసుదేవ్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లైన యువకులు భార్య వండిపెట్టే కమ్మని వంటను తెగ లాగిస్తున్నారు.. దీంతో ఏమౌతుందంటే?