Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రాణం తీసుకోమని ప్రోత్సహించే మానసిక ఒత్తిడి, వదిలించుకునేదెలా?

Advertiesment
ప్రాణం తీసుకోమని ప్రోత్సహించే మానసిక ఒత్తిడి, వదిలించుకునేదెలా?
, సోమవారం, 15 జూన్ 2020 (22:11 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు రిపోర్టులు తెలుపుతున్నాయి. మానసిక ఒత్తిడి జీవితంలో ప్రతి ఒక్కరినీ ఏదో ఒకసారి పట్టుకుటుంది. మానవుడు జీవితంలో ఎన్నో రకాలైన ఒత్తిళ్లకు లోనవుతుంటాడు. రోజువారీ జీవన ప్రయాణంలో అందరూ వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నవారే. ఐతే కొందరు మాత్రం వీటిని భూతద్దంలో పెట్టి చూసి తీవ్ర మానసిక వేదనకు గురై ఇక తనువు చాలించాలని అనుకుంటారు.
 
కొందరిలో శ్రమ అధికమవడంతో పాటు ఏదో సాధించాలనే తపన ఒక్కోసారి మానసిక స్థిమితం లేకుండా చేయడం, ఏదో జరిగిపోతున్నట్లు అనిపించడం, ఎంత ప్రయత్నించినా అందులోంచి బయటికి రాలేకపోతున్నట్లుండటం, దీనికి తోడు ఆత్మన్యూనతాభావం, శారీరక సమస్యలు మరింత దిగజార్చుతాయి. ఇలాంటి పరిస్థితినే ఒత్తిడి అని చెప్పవచ్చు.
 
కొన్ని రకాల లక్షణాలను అంచనా వేసి వాటి తీవ్రతను బట్టి డిప్రెషన్‌ను గుర్తించవచ్చు. అలాగే డిప్రెషన్ ఏ స్థాయిలో ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు నీరసం, చికాకు, నిరాశ, అభద్రతాభావం, అంతా శూన్యమైపోతున్నట్లుగా అనిపించడం, తప్పు చేస్తున్నట్లు మనసుకు అనిపిస్తుండటం, ఏకాగ్రత కోల్పోవటం, జ్ఞాపకశక్తి లోపం, చెడు జరుగుతుందేమోనని భయాందోళనకు గురి కావడం, ఇష్టపడుతున్న వాటిని అయిష్టపడటం వంటి మానసికపరమైన అంశాలు డిప్రెషన్‌ ఉందని చెప్పడానికి లక్షణాలు.
 
అలాగే డిప్రెషన్‌కు గురయినప్పుడు మానసికంగానే కాక, శరీర అవయవాల్లోను మార్పులు జరిగి శారీరక సమస్యలకు కూడా కారణం అవుతోంది. ఉదాహరణకు.. తలనొప్పి, తలతిరుగుట, అతిగా తినడం, పూర్తిగా తిండి మానెయ్యటం, అజీర్ణం, సరైన సమయానికి నిద్రపట్టకపోవటం, అతిగా నిద్రపోతుండటం, శక్తి తగ్గి నీరసించటం, లేదా శారీరక రుగ్మతలు తగ్గకపోవటం వంటి లక్షణాలు తలెత్తుతాయి.
 
అయితే ఇందులోంచి బయటపడాలంటే కొన్ని సూచనలను పాటించాల్సిందే. మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం, పుస్తక పఠనం అలవాటు చేసుకోవటం, బాధ కలిగించే విషయాల నుంచి మనసును మళ్లించే ప్రయత్నం చేయటం, పిక్నిక్ వంటి వాటికి హాజరు కావటం, చిన్న విషయాల గురించి అనవసర ఆందోళనను వదిలిపెట్టడం, ప్రశాంత వాతావరణంలో సమస్యలను పరిష్కరించుకోవడం, బ్రీథింగ్ వ్యాయామాలు చేస్తుండటం, తరుచు పిల్లలతో బయటకు వెళ్లి సరదాగా గడపటం, ఇష్టమైన పనులు చేయడం వంటివి చేస్తే దాదాపు డిప్రెషన్ నుంచి విముక్తులు కావచ్చని నిపుణులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేరేడు పండ్లు వచ్చేశాయ్, తింటే ప్రయోజనాలు ఏంటి? (Video)