Publish Date: Thu, 11 Sep 2014 (14:32 IST)
Updated Date: Thu, 11 Sep 2014 (14:36 IST)
శుక్రవారం పార్వతీదేవిని పూజించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఇంకా ఉమాస్తుతితో అమ్మవారిని నిష్ఠతో పూజించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
దేవి! త్ర్యంబక పత్ని! పార్వతి! సతి! త్రైలోక మాతః! శివే!
శర్వాణి! త్రిపురే! మృడాని! వరదే! రుద్రాణి! కాత్యాయని!
భీమే! భైరవి! చండి! శర్వరికలే! కాలక్షయే! శూలిని!
త్వత్పాద ప్రణతాననన్య మనసః పర్యాకుల న్పాహినః!
దేవీ! పరమేశ్వర పత్నీ! పార్వతీ! ముల్లోకాల జననీ! శర్వాణీ! త్రిపురా! మృడానీ! వరదాయినీ! రుద్రపత్నీ! కాత్యాయనీ! భీమపత్నీ! భైరవపత్నీ! చండీ! రాత్రిరూపా! కాలరూపా! కాలసంహారిణీ! శూలినీ! ఇతరములైనవన్నీ వదిలి నీ పాదములయందే శ్రద్ధ కలిగిన మమ్ములను కాపాడు తల్లీ అని ప్రతి శుక్రవారం అమ్మవారిని కొలిచేవారికి కార్యసిద్ధి చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.