Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లక్ష్మీదేవిని పూజిస్తే.. శుక్రగ్రహ దోషాలు తొలగిపోతాయట!

Advertiesment
Significance of Lakshmi devi puja on friday
, గురువారం, 21 మే 2015 (15:17 IST)
జీవితంలో కొన్ని సమస్యలకు పరిష్కారాలు వేరే కావచ్చు. అయితే మరికొన్ని సమస్యలకు అవసరాలకు డబ్బే ప్రధానం. ధనానికి ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, దారిద్ర్యంతో కష్టాలు అనుభవిస్తుంటే.. ఇక ఆలోచించకుండా శుక్రవారం మహాలక్ష్మీదేవిని పూజించాల్సిందే. 
 
ఆ తల్లి కటాక్షం కావాలంటే అంకితభావంతో కూడిన పూజాభిషేకాలు జరపవలసి వుంటుంది. శుక్రవారం రోజున భక్తిశ్రద్ధలతో సేవించవలసి వుంటుంది. అందువలన అమ్మవారు ప్రీతిచెందుతుందనీ, ఫలితంగా దారిద్ర్యం తొలగిపోయి సంపదలు ప్రసాదించబడతాయని పురోహితులు అంటున్నారు. అంతే కాదు అమ్మవారిని అర్చించడం వలన శుక్ర గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
 
అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికాకపోవడం, అవమానాలు ఎదురుకావడం, అనారోగ్యం వంటివి శుక్రగ్రహ దోషంతో ఏర్పడుతాయి. అందుచేత శుక్రగ్రహ దోషాలను తొలగించుకోవాలంటే.. లక్ష్మీపూజ తప్పనిసరి అని పండితులు అంటున్నారు. అందుచేత శుక్రవారం రోజున ఉపవాస దీక్షను చేపట్టి, అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయడం వలన ... పూజాభిషేకాలు జరపించడం వలన ఆశించిన ఫలితం లభిస్తుందని వారు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu