Publish Date: Mon, 11 Jul 2022 (23:14 IST)
Updated Date: Mon, 11 Jul 2022 (23:16 IST)
సర్వమంగళనామా సీతారామారామా
శర్వవినుత శాంతి దాతారామారామా
మనసులోని మాయ బాపి రామారామ
మనుపుమా నీమోము జూపి రామారామా
నీవు నేనను భేదా బుద్ధీ మాపి మాలో
నిలుపుమా జ్ఞాన సిద్ధి రామారామా
కామక్రోధాలోభా మోహపాశంబులా
కడకు ద్రోసికావుమయ్యా రామారామా
ఏకశిలా పురవాసా సీతారామరామా
లోకేశా బహురూప విలాస కోదండరామా
రామకృష్ణ గోవిందా నారాయణా
ప్రేమించి పాలించునారాయణా