Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాతాళ వినాయకుని పూజిస్తే...?

తొలి పూజలు అందుకునే గణపతి అనేక క్షేత్రాలలో ఆవిర్భవించారు. అటువంటి మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఒకటిగా శ్రీకాళహస్తి చెప్పబడుతోంది. ఈ క్షేత్రంలో పాతాళ గణపతి కూడా దర్శనమిస్తుంటారు. ఈ పాతాళ గణపతి గురించి ధూర్జటి శ్రీ కాళహస్తి మహాత్మ్యంలో, శ్రీనాథుని హరవిలా

పాతాళ వినాయకుని పూజిస్తే...?
, గురువారం, 20 సెప్టెంబరు 2018 (15:14 IST)
తొలి పూజలు అందుకునే గణపతి అనేక క్షేత్రాలలో ఆవిర్భవించారు. అటువంటి మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఒకటిగా శ్రీకాళహస్తి చెప్పబడుతోంది. ఈ క్షేత్రంలో పాతాళ గణపతి కూడా దర్శనమిస్తుంటారు. ఈ పాతాళ గణపతి గురించి ధూర్జటి శ్రీ కాళహస్తి మహాత్మ్యంలో, శ్రీనాథుని హరవిలాసంలో ప్రస్తావన ఉంది. ఈ స్వామి వారు నలభై అడుగుల లోతులో కొలువై ఉండడం వెనుక ఒక కథనం కలదు.
 
పూర్యం అగస్త్యుడు ఈ క్షేత్రంలో జీవనదిలో ప్రవేశించాలని పరమశివుని ప్రార్థిస్తుంటాడు. ప్రార్థనతో స్వర్ణముఖి నది పాయ ఏర్పడింది కానీ అందులో నీళ్లు ఉండవు. గణపతిని పూజించకుండా ఈ కార్యాన్ని చేయడమే అందుకు కారణమని గ్రహించిన అగస్త్యుడు గణపతిని ఆరాధించాడు. పాతాళంలోనికి చేరుకున్న గణపతి ఆ మహర్షి కోరికను నెరవేర్చాడు. 
 
అగస్త్యుడి కోరిక మేరకు గణపతి దర్శనమిచ్చిన చోటునే వెలిశాడు. అందువలన ఈ శ్రీకాళహస్తిలోని వినాయకుని పూజించడం వలన ఆటంకాలు, ఆందోళనలు తొలగిపోయి విజయాలు చేకూరుతాయని భక్తులు వాళ్ళ అనుభవంతో చెబుతుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నుదిటిపై పుట్టుమచ్చ ఉంటే.. ఏం జరుగుతుందో తెలుసా?