అక్రమ సంపాదనతో చేసే విందు భోజనం కన్నా..
కష్టార్జితంతో తాగే గంజినీరు ఎంతో సంతృప్తినిస్తుంది.
పట్టుబట్టి సాధించుకోవలసింది కీర్తి..
పదిలంగా సంరక్షించుకోవలసింది గౌరవం..
అలలు కాళ్ల దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో..
ఎదుటివారి మంచితనాన్ని తేలిక చేసి చూడడం అంతే తప్పు..
బంగారం నాణ్యత అగ్నిలో తెలిసినట్లే ఎదుటివారి మంచితనం..
మనం కష్టంలో ఉన్నప్పుడు తెలుస్తుంది..