లక్ష్మీగవ్వలను ఇంట్లో వుంచడం ద్వారా లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది. భవన నిర్మాణ సమయంలో ఏదో ఒక ప్రదేశంలో గవ్వలు కట్టాలి. కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసే సమయంలోగవ్వలు పెట్టి గుమ్మానికి తప్పనిసరిగా కట్టాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానం పలికినట్లు అవుతుంది.
పసుపు రంగు వస్త్రంలో గవ్వలు పెట్టి పూజా మందిరంలో వుంచి లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేయడం వల్ల ధనాకర్షణ కలుగుతుంది. డబ్బులు పెట్టే ప్రదేశంలో గవ్వలు డబ్బుకు తాకేలా వుంచడం వల్ల రోజూ ధనాభివృద్ధి వుంటుంది. వివాహం ఆలస్యమవుతున్నవారు గవ్వలను దగ్గర పెట్టుకోవడం వలన వివాహ ప్రయత్నాలు శీఘ్రంగా జరుగుతాయి. వివాహ సమయంలో వధూవరుల చేతికి గవ్వలు కడితే నరదృష్టి వుండదు.
కాపురం సజావుగా సాగుతుంది. గవ్వలు శుక్రగ్రహానికి సంబంధించినవి కావడంతో ధనానికి లోటుండదు. ఎక్కడైతే గవ్వలు గలగలు వున్న చోట శ్రీలక్ష్మి దేవి నివాసం వుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.