Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2045లో కలియుగం అంతం కాబోతుందా? 2038-39 రాహు దశ.. దక్షిణాసియా నుంచే చీకటి రోజులు?

2045లో కలియుగం అంతం కాబోతుందా? రాక్షసులే కలియుగాంతానికి కారణం కాబోతున్నారా? అంటే అవుననే సమాధానాలు ఇస్తున్నారు జ్యోతిష్య పండితులు. రావణాసురుడిని రాముడు చంపేయడంతో అంతా ముగిసిందనుకున్నాం. కానీ రావణాసురుడ

2045లో కలియుగం అంతం కాబోతుందా? 2038-39 రాహు దశ.. దక్షిణాసియా నుంచే చీకటి రోజులు?
, శుక్రవారం, 26 మే 2017 (14:16 IST)
2045లో కలియుగం అంతం కాబోతుందా? రాక్షసులే కలియుగాంతానికి కారణం కాబోతున్నారా? అంటే అవుననే సమాధానాలు ఇస్తున్నారు జ్యోతిష్య పండితులు. రావణాసురుడిని రాముడు చంపేయడంతో అంతా ముగిసిందనుకున్నాం. కానీ రావణాసురుడి కుమారులు మళ్లీ జన్మనెత్తడం ఖాయమని.. తద్వారా కలియుగం అంతమైపోతుందట.
 
రావణాసురుని కుమారుడు మేఘనాథుడు 2038-39లోపు మళ్లీ పుడతాడని.. అతని పుట్టుకే కలియుగాంతానికి కారణమవుతుందట. అలాగే రావణుడి మరో కుమారుడు ఇంద్రజీత్ కూడా మళ్లీ పుడతాడని.. తద్వారా కలియుగ అంతం ఖాయమవుతుందని పండితులు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న జనాభా కారణంగా 2050 నాటికి ప్రపంచం అంతమైపోతుందని.. కలియుగంలోని చివరి పాదం ప్రస్తుతం జరుగుతోందని పండితులు అంటున్నారు. పెరిగే జనాభాకు తగిన ఆహారం, నీరు లభించవని తద్వారా 2050 నాటికి కలియుగం అంతం కాక తప్పదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
 
జ్యోతిష్యం ప్రకారం రాహుదశ ప్రారంభమై.. మతకల్లోలాలు, అంతర్యుద్ధాలు జరుగుతాయని.. ఈ వినాశనం దక్షిణాసియా నుంచే ప్రారంభం అవుతుందట. ఇక కలియుగ అంతంపై పాత గ్రంథాల ఆధారంగా జ్యోతిష్కులు పరిశోధన చేస్తున్నారు. మేఘనాథుడు దక్షిణాసియాలో పుడితే ఆ ఏడాది నుంచి వినాశక పరిణామాలు చోటుచేసుకుంటాయి. డిసెంబర్ 2038 నుంచి డిసెంబర్ 2039 మధ్య కాలంలో మేఘనాథుడు పుడతాడని.. అప్పటి నుంచి 2095 వరకు వినాశకం జరుగుతుందని.. ఆ కాలం మానవులకు చీకటి రోజులు తప్పవట. 
 
రక్తం ఏరులై పారుతుందని, ప్రకృతీ వైపరీత్యాలు తప్పవని, కరువు కాటకాలు తాండవం చేస్తాయని పండితులు చెప్తున్నారు. ప్రకృతి తల్లి పూర్తిగా నశించి.. భూమి అనేది వుండదని 15వ శతాబ్ధపు సాధువు విక్రమ్ సమావత్ వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. తద్వారా భూమిపై ఇక 29 సంవత్సరాలు మాత్రమే మానవులు నివసించేందుకు వీలుంటుందని విక్రమ్ సమావత్ పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నైలో ఛత్రపతి శివాజీ పూజించిన దేవాలయం... కోరిన కోర్కెలు నెరవేరుతాయ్...