వాహనాలకు నిమ్మ, మిరపకాయ కట్టాలా.. ఎందుకు?

బుధవారం, 7 నవంబరు 2018 (12:15 IST)
చాలామంది కొత్తగా వాహనాలు కొన్నప్పుడు నిమ్మకాయ, గుమ్మడి వంటి వాటితో దిష్టి తీస్తుంటారు. ఎందుకు అలా చేస్తారానే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
 
సాధారణంగా హనుమంతుని ఆలయంలో వాహన పూజలు జరిపిస్తుంటారు. దేవుళ్లకు నివేదించిన నిమ్మకాయలను వాహనాలకు కడుతుంటారు. అంతేకాకుండా దిష్టి తీసి వాహన చక్రాలతో తొక్కిస్తారు. ఇలా చేస్తే మేలు జరుగుతుందని ఆశిస్తారు. పులుపుగా ఉండే నిమ్మకాయ, కారం నిండి ఉండే పచ్చిమిర్చిలను వాహనాలకు, దుకాణాల మధ్య వేలాడదీస్తారు. 
 
శాస్త్రం ప్రకారం ఇలా చేయడం ఆనవాయతి అని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. గ్రహాలలో ఎర్రని, ఉద్రత్వం కలిగినది కుజగ్రహం. కుజుడు ప్రమాద కారకుడని శాస్త్రం నమ్మకం. కుజునికి ఆదిదేవుడు హనుమంతుడు. అలానే గ్రహాల్లో శుక్ర గ్రహానికి చెందిన రుచి పులుపు. అభివృద్ధికి, సంపదకు శుక్రుడు కారకుడు. కారం విగ్రహానికి సంబంధించినది. అధికారానికి రవి కారకుడు. వీరు వాహన చోదకుని పట్ల శాంతులై ఉండాలని కోరుకుంటూ వాహనాలకు నిమ్మకాయలు, మిరపకాయాలు కడతారు.   

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 07-11-2018 బుధవారం దినఫలాలు - ఊహించని ఖర్చుల వల్ల ఒడిదుడుకులు...