Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోళ్లను స్నానానికి తర్వాత కత్తిరిస్తే దోషమా? (video)

మంగళ, శుక్రవారాల్లో గోళ్లను కత్తిరించవచ్చా.. అనే డౌట్‌ మీలో వుందా..? అయితే ఈ కథనం చదవండి. మంగళవారం, శుక్రవారాలు దుర్గాదేవి, శ్రీ మహాలక్ష్మీదేవిలకు ప్రీతికరమైన రోజులు. ఈ రోజుల్లో మన వద్ద వున్న నగదును ల

Advertiesment
Nails
, గురువారం, 27 సెప్టెంబరు 2018 (15:47 IST)
మంగళ, శుక్రవారాల్లో గోళ్లను కత్తిరించవచ్చా.. అనే డౌట్‌ మీలో వుందా..? అయితే ఈ కథనం చదవండి. మంగళవారం, శుక్రవారాలు దుర్గాదేవి, శ్రీ మహాలక్ష్మీదేవిలకు ప్రీతికరమైన రోజులు. ఈ రోజుల్లో మన వద్ద వున్న నగదును లేదా ఏదైనా సంపదనిచ్చే వస్తువులను ఇతరులకు ఇవ్వడం ద్వారా లక్ష్మీదేవి మనల్ని వీడి వారిని చేరుతుందని విశ్వాసం. 
 
ఇంకా మంగళ, శుక్రవారాలు దుర్గ, లక్ష్మీదేవికి ప్రీతికరం కావడంతో ఆ రోజున జుట్టు కత్తరించడం లేకుండా గోళ్లను కత్తరించడం చేస్తే అదృష్టం దురదృష్టం మారుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మంగళవారం జుట్టుకు కత్తిరిస్తే.. రక్తానికి సంబంధించిన రోగాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
అలాగే శని, కుజుని ప్రభావంతో ఈతిబాధలు తప్పవని చెప్తున్నారు. ఇక మహాలక్ష్మీకి ఇష్టమైన శుక్రవారం పూట ఏదైనా కొత్త వస్తువును పొందాలే కానీ నష్టపోవడం కూడదు. శుక్రవారం పూట ఏదైనా వస్తువునే ఇతరులకు ఇవ్వకూడదంటారు. అలాంటిది.. శరీరంలో భాగమైన గోళ్లను కత్తిరించడం, జుట్టును కత్తిరించడం సరికాదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అందుకే మంగళ, శుక్రవారాల్లో గోళ్లను, జుట్టును కత్తిరించకూడదని వారు చెప్తున్నారు. మంగళవారం, శుక్రవారం పూర్తిగా గోళ్లు కత్తిరించడం నిషిద్ధం. జుట్టు కత్తిరించుకున్న నాడే గోళ్లను కూడా తీసుకోవాలి. సోమ, బుధ, గురువారాలు జుట్టు కత్తిరించుకోవచ్చు. శని, ఆదివారాలు కూడా జుట్టును కత్తిరించుకోవచ్చు.

గోళ్లు, జుట్టు మనదేహంలోని మృతకణాలకు ప్రతీక. శరీరంలోని మృతకణాలు జుట్టుగా, గోళ్లుగా పెరుగుతాయి. అందుకే గోళ్లను స్నానానికి పూర్వమే తొలగించాలి. స్నానానికి తర్వాత గోళ్లను కత్తిరించడం దోషమని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. 
 
మంగళవారానికి కుజుడు ఆధిపత్యం కలిగివున్నాడు. యుద్ధకారకుడు. అందుకే అతను ఆధిపత్యం వహించే రోజున కాకుండా ఇతర రోజుల్లో గోళ్లు కత్తిరించుకోవడం ఉత్తమం. సూర్యోదయానికి పూర్వమే, స్నానాదికాలు చేసేందుకు మునుపే గోళ్లను తొలగించుకోవాలి. అలాగే ఇంటి బయట మాత్రమే గోళ్లను కత్తిరించాలి. గోళ్లు, జుట్టు ఇంట్లో కత్తిరించడం దరిద్రం. అవి ఆహార పదార్థాల్లో చేరితే జీర్ణం కావు. 
 
పాపాలన్నీ సూర్యుని వద్దకు వెళ్తే.. ఆ భగవానుడు నా వద్ద వుండకండి.. గోళ్లను ఆశ్రయించండి.. అన్నాడట. అందుకే పాపాలన్నీ గోళ్లు, జుట్టు రూపంలో వుంటాయని.. అలాంటి పాపకారకాలను శుభప్రదమైన రోజున తొలగించడం మంచిది కాదని.. అందుకే మంగళ, శుక్రవారాల్లో గోళ్లను, జుట్టును కత్తిరించకూడదని జ్యోతిష్య నిపుణులు సెలవిస్తున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అద్దాల గదిలో కుక్కలాంటి మనస్తత్వం వుంటే అంతేసంగతులు...