Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎంత బంగారం కొన్నా బ్యాంకుల్లో తనఖా పెట్టాల్సి వస్తోంది.. ఎందుకూ?!

పొరపాటున కాని తెలిసి కాని పడకగది మంచం మీద ఇవి మాత్రం అస్సలు పెట్టకండి పెడితే దారిద్ర్యం మన వెంటే ఉంటుంది. మనం అలవాటులో పొరపాటుగానో లేక సౌకర్యంగా ఉంటుందనో కొన్ని వస్తువుల్ని మంచం మీద పెడుతుంటాం. అలా పెట్టడం వల్ల ధనలక్ష్మీ అమ్మవారికి ఆగ్రహం కలుగుతుందని

ఎంత బంగారం కొన్నా బ్యాంకుల్లో తనఖా పెట్టాల్సి వస్తోంది.. ఎందుకూ?!
, శుక్రవారం, 17 మార్చి 2017 (21:02 IST)
పొరపాటున కాని తెలిసి కాని పడకగది మంచం మీద ఇవి మాత్రం అస్సలు పెట్టకండి పెడితే దారిద్ర్యం మన వెంటే ఉంటుంది. మనం అలవాటులో పొరపాటుగానో లేక సౌకర్యంగా ఉంటుందనో కొన్ని వస్తువుల్ని మంచం మీద పెడుతుంటాం. అలా పెట్టడం వల్ల ధనలక్ష్మీ అమ్మవారికి ఆగ్రహం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. ఇంతకూ మంచం మీద ఏయే వస్తువులు పెట్టకూడదంటే..
 
ఆభరణాలు :
ముత్యాలు, గవ్వలు, ఎప్పుడూ మంచం మీద పెట్టరాదు. సాలగ్రామాలు, రుద్రాక్షలు, బంగారు, వెండి ఆభరణాల్ని, వజ్రాభరణాల్ని, పచ్చల్ని మంచం మీద పెట్టకూడదు. బెడ్‌రూంలో బీరువా తెరవగానే బంగారం ఉండే డబ్బాల్ని తీసుకొచ్చి మంచం మీద పెడతాం అలా చేయడం కూడా లక్ష్మీ క్షయం అవుతుంది. 
 
బంగారానికి వున్న లక్షణం తోటి బంగారాన్ని మీ ఇంట్లోకి రమ్మని పిలుస్తుందని శాస్త్రం చెబుతోంది. అంటే మీరు ఇంకా ఆభరణాలు కొనుక్కునే అవకాశాలు మెరుగవుతాయి. కాని మంచం మీద పెడితే అవి కొత్త బంగారాన్ని పిలవకపోగా బయటకు వెళ్లేందుకు చూస్తాయట. కొందరికి ఎంత బంగారం ఉన్నా ఎప్పుడూ బ్యాంకుల్లోనే ఉంటుంది. దానికి కారణం మంచం మీద ఆభరణాలను ఉంచడమేనట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాధకులు అంటే ఎవరో తెలుసా... మనసులో తలచుకుంటే చేయగల సమర్థుడెవరు?