Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2025లో ఏ రాశుల వారికి శుభకరంగా వుంటుందో తెలుసా?

Astrology

సెల్వి

, గురువారం, 21 నవంబరు 2024 (20:52 IST)
కొత్త సంవత్సరంలో గ్రహాల మార్పు.. కొన్ని రాశులకు కలిసివస్తుంది. నూతన సంవత్సరం తొలి నెల జనవరిలో కొన్ని ప్రధాన గ్రహాలు రాశులను మార్చుకుంటాయి. జనవరిలో బుధుడు, శుక్రుడు, కుజుడు, శని, సూర్యుడు తమ రాశిచక్రాలను మార్చుకుంటారు.
 
అన్నింటిలో మొదటిది గ్రహాలలో రాకుమారుడు బుధుడు జనవరి 4, 2025న ధనుస్సు రాశిలోకి వెళ్తాడు. జనవరిలో శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహాలలో శని గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే రెండున్నర సంవత్సరాల తర్వాత శని కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. 
 
గ్రహాల రాజుగా పరిగణించే సూర్యుడు జనవరిలో మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీన్ని మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. శని తర్వాత కుజుడు కర్కాటక రాశిలోకి వెళ్తాడు. ఈ మార్పు అనేక రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది.
 
ఈ సంవత్సరం అతిపెద్ద మార్పు శని గ్రహం. మీన రాశిలో శని గ్రహం రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు. కీలకమైన ఈ గ్రహాల మార్పు కారణంగా అన్ని రాశులవారు ప్రభావితమైనప్పటికీ ముఖ్యంగా మేషం, వృషభం, సింహ రాశి వారు ఎక్కువగా ప్రభావితమవుతారు.
 
మేషం
మేష రాశి వారికి కొత్త సంవత్సరం అనుకూలం. జీవితంలో మార్పులు తథ్యం. ఈ సంవత్సరం ఈ రాశికి సానుకూల ఫలితాలుంటాయి. అడ్డంకులు తొలగిపోతాయి. కార్య విజయం వుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయ వనరులు సృష్టించబడతాయి. ఆదాయం పెరుగుతుంది. మీ వైవాహిక జీవితంలో కొన్ని హెచ్చు తగ్గులు ఉండవచ్చు.
 
వృషభం
వృషభ రాశికి కొత్త సంవత్సరం శుభాలను ఇస్తుంది. ఆర్థిక పరిస్థితికి ఢోకా వుండదు. సిరిసంపదలు వెల్లి విరుస్తాయి. కొత్త సంవత్సరం మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. డబ్బు, అదృష్టం రెండూ వీరికి అండగా నిలుస్తాయి. తీరని కోరికలు ఈ సమయంలో నెరవేరతాయి.
 
సింహ రాశి
సింహ రాశి వారికి కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. అయితే ఆర్థిక పరమైన ఇబ్బందులు వుండవు. ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. మొత్తం మీద కొత్త సంవత్సరం పూర్తిగా సింహరాశికి లాభాలను ఇస్తుంది. ఆదాయాన్ని పెంపొందింపచేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

21-11-2024 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...