ఇంట్లో ఏదైన పురుగులు, కీటకాలు కనిపించినా, ఇంట్లోకి ప్రవేశించినా వాటిని వెంటనే బయటికి వెళ్లగొట్టేంత వరకు నిద్రపోరు కొందరు. మరికొందరు అయితే తరిమేదాకా ఒంటికాలిపై ఉంటారు. అయితే కొన్ని పురుగులు ఇంట్లో చేరితే చాలా మేలు జరుగుతుందని జ్యోతిష్కులు కొందరు చెబుతున్నారు.
బొద్దింకలు అంటే బయపడే వారు చాలా మంది ఉన్నారు. అవి ఇంట్లోకి వస్తే చాలు బయటికి తరిమే దాగా వాటితో కుస్తీ పడతారు. అయితే ఇలాంటి బొద్దింకలు ఎక్కువగా ఇంట్లో చేరితే లక్ష్మీప్రదము కలుగుతుందని జ్యోతిష్కులు అభిప్రాయపడుతున్నారు.
అదేవిధంగా కాళ్ళజెర్రి ఇంట్లోకి వచ్చిందంటే వారికి మంగళప్రదము కలుగుతుందని జ్యోతిష్కులు అంటున్నారు. కానీ సాలెపురుగులు చేరినట్లైతే మాత్రం దరిద్రము ఇంట్లో తాండవం చేస్తుందంటున్నారు. పాములు, పేడపురుగులు లాంటివి వస్తే గృహమందు గలవారికి భీతి, అపకారము కలుగుతుంది.
చెదలు పురుగులు చేరిందంటే ఆ గృహమందు ఐశ్వర్యహాని కలుగుతుందని అంటున్నారు. ఇంట్లో గండు చీమలు కనిపిస్తే చాలు అవి ఎక్కడ కుట్టేస్తుందో అన్న భయంతో వాటిని మందు పెట్టి మరీ చంపేస్తారు కానీ, గండు చీమలు చేరితే భాగ్యలాభములు కలుగుతుందట.