భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి నాడు వినాయక చవితిని జరుపుకుంటాం. ఈ ఏడాది 27న వినాయక చవితిని జరుపుకుంటున్నాం. ఈ వినాయక చవితి రోజున రవియోగం, ఇంద్ర బ్రహ్మ యోగం, ప్రీతి యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అంతేగాకుండా లక్ష్మీ నారాయణ యోగం కూడా ఏర్పడుతుంది. ఇంకా మహా శనియోగం కూడా ఇదే రోజు ఏర్పడుతుండటం విశేషం. ఈ యోగాల కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం వరించనుంది.
ముందుగా ఈ యోగం కారణంగా తులారాశికి అదృష్టం వరిస్తుంది. లాభాలు వుంటాయి. కొత్త అవకాశాలు వస్తాయి. మీపై ఇతరులకు నమ్మకం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు మంచి సమయం. కొత్త వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. అలాగే కుంభరాశి జాతకులకు, మకర రాశి జాతకులకు వినాయక చవితి సందర్భంగా ఏర్పడే యోగాల ద్వారా సానుకూల ఫలితాలు వుంటాయి.
కుంభరాశికి వ్యాపారాల్లో లాభాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచి సమయం. విద్యార్థులకు అనుకూలం. ప్రేమికులకు సానుకూలత వుంటుంది. ఉద్యోగస్తులకు కలిసి వచ్చే కాలం. మకర రాశి జాతకులకు వినాయక చవితి రోజున ఏర్పడే యోగాల కారణంగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థికపరంగా అభివృద్ధి వుంటుంది. కుటుంబంలో ఐక్యత ఏర్పడుతుంది. కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేపడతారు.