ఇంట్లోని వాస్తు దోషాలను తొలగించే మామిడి తోరణం.. ఎలాగంటే?
చిన్న శుభకార్యమైనా, చిన్న లేదా పెద్ద పండగొచ్చినా.. ఇంటి గడపకు మామిడి తోరణం కట్టేస్తాం. ఇంకా పూజలు చేసేటప్పుడు కలశంలో టెంకాయను ఉంచి దాని కింద మామిడి ఆకుల్ని ఉంచుతాం. అలా కలశంలో దేవుతలను ఆవాహన చేస్తారం.
చిన్న శుభకార్యమైనా, చిన్న లేదా పెద్ద పండగొచ్చినా.. ఇంటి గడపకు మామిడి తోరణం కట్టేస్తాం. ఇంకా పూజలు చేసేటప్పుడు కలశంలో టెంకాయను ఉంచి దాని కింద మామిడి ఆకుల్ని ఉంచుతాం. అలా కలశంలో దేవుతలను ఆవాహన చేస్తారం. పూజ ముగిసిన తర్వాత కలశంలోని నీటిని మామిడి ఆకులతో ఇళ్లంతా చల్లుతాం. ఇలా మామిడి ఆకులు.. దేవతా పూజలో కీలక స్థానాన్ని సంపాదించుకుంటున్నాయి. ఇంకా చెప్పాలంటే.. మామిడి ఆకుల్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని విశ్వాసం.
పండుగలు పబ్బాల్లోనే కాకుండా రోజూ మామిడి తోరణాలతో గడపను అలంకరిస్తే లక్ష్మీదేవి ఆ ఇంట నివాసం ఉంటుందని.. వాస్తు దోషాలు తొలగిపోతాయని ఐతిహ్యం. మామిడి తోరణాలు కట్టడం ద్వారా ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ప్రతికూల శక్తులు ఇంటి నుంచి తొలగిపోతాయి. గాలి శుభ్రపడుతుంది. ప్రధాన ద్వారంలో నివసించే.. వాక్‌దేవత ఆ ఇంటికి మేలు చేస్తుంది.
మామిడి ఆకులు ఎండిపోయినా అందులోని శక్తి ఏమాత్రం తగ్గదు. అయితే ద్వారానికి ప్లాస్టిక్ మామిడి ఆకుల్ని కట్టకూడదు. ఇక మామిడి ఆకులకు మరో ప్రత్యేకత ఉంది. చెట్టునుంచి మామిడి ఆకులను వేరు చేసినప్పటికీ పర్యావరణాన్ని కాపాడే శక్తిని ఇందుకుంటుంది. అలంకరణకే కాదు మామిడి ఆకులు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.