వేడి వేడిగా ఉన్న ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్నారా?
భగవంతుని జరిపే పంచోపచారాల్లో నైవేద్యానికి విశిష్టమైన స్థానం ఉంటుంది. నైవేద్యాన్ని ఎందుకు పెడతారంటే? తనకు రోజూవారీ ఆహారం లభించేలా చేసిన భగవంతునికి కృతజ్ఞతలు చెప్తూ దీనిని సమర్పిస్తారు. భగవంతుని నైవేద్య
భగవంతుని జరిపే పంచోపచారాల్లో నైవేద్యానికి విశిష్టమైన స్థానం ఉంటుంది. నైవేద్యాన్ని ఎందుకు పెడతారంటే? తనకు రోజూవారీ ఆహారం లభించేలా చేసిన భగవంతునికి కృతజ్ఞతలు చెప్తూ దీనిని సమర్పిస్తారు. భగవంతుని నైవేద్యంగా సమర్పించబడేది.. ఆపై ప్రసాదంగా మారుతుంది. అందుకే నైవేద్యం సమర్పించేటప్పుడు నిష్ఠతో పద్ధతులను పాటించాలి.
భగవంతునికి నైవేద్యం సమర్పించేటప్పుడు.. ఆహార పదార్థాలు బాగా వేడిగా ఉండనే కూడదు. అలాగని చల్లారిపోనూ కూడదు. ఇవి రెండూ నైవేద్యానికి పనికిరావు. శుచిగా అప్పుడే వండిన పదార్థాలై.. కొంచెం వేడి తగ్గినట్లుండాలి. వీటీని నైవేద్యంగా సమర్పించవచ్చు.
ఇక నైవేద్యంగా సమర్పించే పదార్థాలు ఇంట్లోనే తయారు చేసుకోవాలి. బయటి నుంచి కొనుగోలు చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టకూడదు. అలాగే పాడైపోయిన పదార్థాలు.. నిల్వ ఉంచిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించకూడదు. బంగారు, వెండి లేదా రాగి పాత్రల్లో నైవేద్యాన్ని సమర్పించాలి.
ఇవన్నీ కుదరకపోతే శుభ్రమైన అరటి ఆకులో పెట్టొచ్చు. ప్లాస్టిక్, స్టీలు, గాజు పాత్రలలో భగవంతునికి నైవేద్యం సమర్పించకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.