Publish Date: Mon, 27 Sep 2021 (22:14 IST)
Updated Date: Mon, 27 Sep 2021 (22:17 IST)
మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు తీసుకోకండి అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. శాస్త్ర ప్రకారం మంగళవారం తీసుకున్న రుణాలు లేదా అప్పులు తిరిగి చెల్లించడం కష్టమౌతుందని మంగళవారం అప్పు పొరబాటున కూడా చేయవద్దు అంటారు. అలాగే మంగళవారం నాడు నూతన బట్టలను కొనుగోలు చేయకూడదు. అదే విధంగా ఇదే సమయంలో ధరించకూడదు. ఎందుకంటే ఈ రోజు ధరిస్తే మంగళకరంగా భావిస్తారు.
ఈ రోజు కొత్త బట్టలు ధరించడం వలన అవి ఇతర కారణాల చేత ఏదోలా చిరిగిపోతాయని నమ్ముతారు. ఈ రోజు ధరించిన నూతన వస్త్రాలు ఎక్కువ రోజులు ఉండవు. శనితో సంబంధమున్నందను మంగళవారం కొత్త దుస్తులుతో పాటు కొత్త బూట్లను ధరించకూడదు. నూతన బూట్లు వేసుకోవడం వల్ల గాయాలవుతాయి. అంతేకాకుండా డబ్బు కోల్పోయే ప్రమాదముందని విశ్వసిస్తారు.